ePaper
Sunday, July 12, 2026
ePaper
Homeఎడిటోరియల్సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడం లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం.

సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడం లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం.

📰 Generate e-Paper Clip

భూ భారతి లో పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలి

సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటం లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం

తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు

ఏన్కూరు:- భూ భారతి లో భాగంగా సమగ్ర భూ సర్వే జరిపి కాస్తు ఆధారంగా పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఏన్కూరు మండలం తిమ్మారావు పేట లో సెంటర్ లో సిపియం పతాకాన్ని కాట్రాల బిక్షం ఎగురవేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి దొంతి బోయిన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో బొంతు రాంబాబు మాట్లాడుతూ ధరణ స్థానం లో భూ భారతి చట్టం వచ్చిన భూ సమస్యలు కు పరిష్కారం దొరకడం లేదని అన్నారు. సమగ్ర భూ సర్వే జరిపి భూమి సాగు ఆధారంగా పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాల సాగు భూమి కి నీరు అందించే సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు సవరించిన అంచనాలు తయారు చేసిన రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం బడ్జెట్ లో మాత్రం 336 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసింది అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు అవసరమైన నిధులు విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. మహాత్మ గాంధీ ఉపాధి హామీ దేశం లో ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం కు వంద రోజులు పని గ్యారంటీ ఇచ్చిన చట్టం మార్పులు చేసి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఇష్టం అయిన ప్రాంతాల్లో మాత్రమే ఉపాధి హామీ పథకం అమలు చేయుటకు జూలై 1 నుంచి అమలు చేస్తున్నారు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో రైతులు పండించిన పంట కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం రేషన్ విధించడం ద్వారా రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా లభించ కుండా చేస్తుంది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే మేరకు రాష్ట్రం లో కొనుగోలు చేస్తుంది అని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం చేయడం సరికాదని అన్నారు. ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల వ్యవసాయం మీద ప్రభావం చూపుతుంది అని అన్నారు. గ్రామీణ ప్రజలు వ్యవసాయ రంగం రక్షణ కోసం ఉద్యమించాల్సిన సమయం వచ్చింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి, కృష్ణ, తాళ్ళపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు బాణోత్ బాలాజీ, సిపిఎం మండల కార్యదర్శులు కుందనపల్లి నరేంద్ర, అంబటి శ్రీనివాస్ రెడ్డి, బాణాల శ్రీనివాసరావు, గ్రామ కార్యదర్శి కలసాని సాయి, సిఐటియు జిల్లా నాయకులు వెల్పుల రాములు, రైతు సంఘం నాయకులు గుండా సత్యనారాయణ రెడ్డి, ఎస్ కె జానీ ,రేగల తిరుమల రావు,మన్నేపల్లి పద్మా, లక్ష్మి, వెంకట్రావమ్మ, మాజీ సర్పంచ్లు కొడేం బిక్షం,బండ్ల చిన్న జోగయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!