పంచాయతీ రాజ్ చట్టం కింద సీజింగ్:
బిఎన్ఎస్ (BNS) చట్టం కింద కఠిన హెచ్చరిక:
నల్లబెల్లి (వరంగల్ జిల్లా):
నల్లబెల్లి మండల కేంద్రంలోని “నగేశ్ నూనె మిల్లు”లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంపై గ్రామ పంచాయతీ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ (Trade License) లేకుండా, కనీస భద్రతా ఏర్పాట్లు పాటించకుండా అనధికారికంగా నడుపుతున్న ఈ నూనె మిల్లును శుక్రవారం (21-08-2026) తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ సమక్షంలో మిల్లును శుక్రవారం సీజ్ చేశారు.రంగాపురం గ్రామానికి చెందిన కందగట్ల కవిత స్థానిక మహిళా పొదుపు సంఘంలో సీఏ (మహిళా సంఘం విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్) గా పనిచేస్తున్నారు.తేదీ 19-08-2026 నాడు కవిత నూనె పట్టించుకోవడానికి రాగా, మిషన్ పళ్లచక్రాల్లో చేయి ఇరుక్కుపోవడంతో ఆమె చేయి తెగి తీవ్ర అంగవైకల్యం సంభవించింది. మిల్లు యజమాని జక్కుల నగేశ్ ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండా, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా అనధికారికంగా మిల్లు నిర్వహిస్తున్నారు.సరైన అనుమతులు లేకపోవడం, భద్రతా లోపాలపై సమాధానం చెప్పాలని పంచాయతీ కార్యాలయం నుండి 20-08-2026న సదరు మిల్లు నిర్వాహకుడైన జక్కుల నగేశ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.నోటీసు ఇచ్చిన 24 గంటల గడువులోగా ఎలాంటి సంతృప్తికర వివరణ ఇవ్వకపోవడంతో, ప్రజా భద్రత దృష్ట్యా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ మరియు అధికారులు పంచుల సమక్షంలో మిల్లు ప్రాంగణాన్ని సీజ్ (SEIZE) చేశారు.సీలు చేసిన మిల్లు ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించినా, తాళాలు/సీలు విరగ్గొట్టినా లేదా యంత్రాలను తరలించే ప్రయత్నం చేసినా బిఎన్ఎస్ (BNS) చట్టం ప్రకారం నాన్-బెయిలబుల్ క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. . ప్రమాదానికి కారణమైన మిల్లు యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు కేసు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

