ePaper
Thursday, September 24, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్సంగెం శివారులో 4 లీటర్ల గుడుంబా పట్టివేత ఒకరి అరెస్ట్.

సంగెం శివారులో 4 లీటర్ల గుడుంబా పట్టివేత ఒకరి అరెస్ట్.

📰 Generate e-Paper Clip

సంగెం శివారులో 4 లీటర్ల గుడుంబా పట్టివేత ఒకరి అరెస్ట్.

పీపుల్స్ డైరీ. వరంగల్ క్రైమ్ బ్యూరో

అక్రమంగా గుడుంబా తరలిస్తూ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని సంగం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 20 ప్యాకెట్లలో ఉన్న 4 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సిబ్బందికి సంగం శివారులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతడిని తనిఖీ చేయగా, సంచిలో 20 కవర్ ప్యాకెట్లలో గుడుంబా ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో ప్యాకెట్‌లో సుమారు 200 మిల్లీలీటర్ల గుడుంబా ఉన్నట్లు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న గుడుంబా విలువ సుమారు రూ.1,600గా పోలీసులు తెలిపారు. నిందితుడిని సంగం మండలానికి చెందిన రాయపురం మల్లయ్య (57)గా గుర్తించారు.
గుడుంబా తయారీ, విక్రయం, తరలింపు చట్టరీత్యా నేరమని ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు. అక్రమంగా గుడుంబా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!