ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeరాజకీయంబీఆర్‌ఎస్‌కు షాక్: బీజేపీలో చేరిన క్లస్టర్ ఇంచార్జ్ మామిండ్ల మోహన్ రెడ్డి

బీఆర్‌ఎస్‌కు షాక్: బీజేపీలో చేరిన క్లస్టర్ ఇంచార్జ్ మామిండ్ల మోహన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

నల్లబెల్లి: సెప్టెంబర్ 12: పీపుల్స్ డైరీ

నర్సంపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆదరణ పుంజుకుంటోంది. నల్లబెల్లి మండలం మామిండ్లవీరయ్యపల్లెకు చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇంచార్జ్ మామిండ్ల మోహన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.మండల బీజేపీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో మోహన్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ..బీజేపీకి రోజురోజుకూ ప్రజల నుంచి,వివిధ పార్టీల నాయకులు మరియు కార్యకర్తల నుంచి పెరుగుతున్న మద్దతుకు ఈ చేరిక నిదర్శనమన్నారు.రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో బీజేపీని మరింత బలోపేతం చేసి,ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు.అనంతరం పార్టీలో చేరిన మోహన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో రాణా ప్రతాప్ రెడ్డి ప్రజలకు చేస్తున్నసేవ విధానం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బచ్చు వెంకటేశ్వర్ రావు, మండల ఉపాధ్యక్షులు బత్తిని కుమారస్వామి, గ్రామ పార్టీ అధ్యక్షుడు ధర్మారం క్రాంతి కుమార్, యువ మోర్చా నాయకులు తిమ్మాపురం శివ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!