ePaper
Thursday, October 15, 2026
ePaper
Homeవరంగల్వరంగల్ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా వైస్ చైర్మన్ గా శానబోయిన రాజ్ కుమార్..

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా వైస్ చైర్మన్ గా శానబోయిన రాజ్ కుమార్..

📰 Generate e-Paper Clip

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా వైస్ చైర్మన్ గా శానబోయిన రాజ్ కుమార్..

దుగ్గొండి.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా వైస్ చైర్మన్ గా మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ఎన్నికయ్యారు ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి జడ్పీ సీఈవో వసంత నియామక పత్రం అందజేశారు.. విదేశాలలో ఉన్నత చదువులు అభ్యసించి కొంతకాలం పాటు ఉద్యోగం చేసిన అనంతరం స్వగ్రామానికి చేరుకున్న రాజ్ కుమార్ ప్రజా సేవే లక్ష్యంగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు 2014 నుండి ప్రతి సంవత్సరం రెండుసార్లు వివిధ సందర్భాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఏడాదికి రెండు వందల యూనిట్ల రక్తాన్ని రెడ్ క్రాస్ సొసైటీకి అందజేస్తున్నారు 12 ఏళ్ల కాలంలో 2500 యూనిట్ల రక్తాన్ని అందించి ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచారు.. రక్తదానం పట్ల యువకులకు అవగాహన కల్పించి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే విధంగా వారిలో చైతన్యం నింపారు.. ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు నోటుబుక్కులు దుస్తులు అందించడంతోపాటు మౌలిక వసతుల కల్పన కోసం సైతం గత 12 ఏళ్లుగా కృషి చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల జరిగిన రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలలో వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఈ సందర్భంగా రాజ్ కుమార్ ను మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు మంగళవారం అభినందించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్ కుమార్ మాట్లాడారు.. గ్రామీణ ప్రాంతాల్లో రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించి ప్రతి యువకుడు ఏడాదికి రెండు మార్లు రక్తం అందించేలా కృషి చేస్తానన్నారు.. సామాజిక చైతన్య కార్యక్రమాలలో యువకులను భాగస్వాములను చేస్తూ గ్రామాలు అభివృద్ధి బాట పట్టేలా నిరంతరం పనిచేస్తానన్నారు. తన నియమాకానికి సహకరించిన రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు జిల్లా ప్రజలకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!