ePaper
Thursday, October 15, 2026
ePaper
Homeఎడిటోరియల్అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్లతో మీసేవ సర్టిఫికెట్లు.. కొత్త పేపర్‌తో ఇక లామినేషన్ అవసరం లేదు!

అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్లతో మీసేవ సర్టిఫికెట్లు.. కొత్త పేపర్‌తో ఇక లామినేషన్ అవసరం లేదు!

📰 Generate e-Paper Clip

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందజేసే మీసేవ సర్టిఫికెట్ల భద్రత, మన్నికను పెంచేందుకు కీలక అడుగు వేసింది. చిరిగిపోని, నీటిలో తడవని 15 అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన నూతన సెక్యూరిటీ పేపర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

 

కొత్త మీ సేవ సర్టిఫికేట్లు

ప్రభుత్వ సర్టిఫికెట్ల రక్షణ, మన్నిక, నకిలీల నిరోధమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. మీసేవ కేంద్రాల ద్వారా జారీ చేసే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నూతన -జనరేషన్ సెక్యూరిటీ పేపర్ను రాష్ట్ర సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు హైదరాబాద్ లోని ప్రజాభవన్లో ఆవిష్కరించారు.

ఫోర్జరీ, నకిలీ సర్టిఫికెట్ల తయారీని పూర్తిగా అరికట్టేందుకు ఈ కొత్త పేపర్లో అత్యంత భద్రతతో కూడిన 15 రకాల -ఆడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరిచారు. భద్రతా కారణాల రీత్యా ఈ ఫీచర్ల వివరాలను వెల్లడించలేదు. ప్రత్యేక సాంకేతికతతో తయారైన ఈ కాగితం సులభంగా చిరిగిపోదు, నీటిలో తడిచినా పాడవదు. నిత్యం వాడటం, -మడతపెట్టడం, సుదీర్ఘకాలం దాచి ఉంచడం వల్ల వచ్చే ఇబ్బందులు తట్టుకునేలా దీనిని డిజైన్ చేశారు.

-ఈ అధిక మన్నిక కారణంగా పౌరులు ఇకపై సర్టిఫికెట్లకు ప్లాస్టిక్ లామినేషన్ చేయించాల్సిన అవసరం ఉండదు. ఈ -సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, విద్య, ఉద్యోగ, -ఇతర అధికారిక అవసరాలకు సంబంధించిన సర్టిఫికెట్లు పౌరుల జీవితంలో అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు.

“చాలా ప్రభుత్వ సర్టిఫికెట్లను పౌరులు దశాబ్దాల పాటు, కొన్నిసార్లు జీవితకాలం భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. అలాంటి -ముఖ్యమైన పత్రాలు సురక్షితంగా, మన్నికగా, నమ్మదగినవిగా ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత’ అని మంత్రి శ్రీధర్ =బాబు తెలిపారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలను అందిస్తున్నామని, కొత్త సెక్యూరిటీ పేపర్ వల్ల ప్రభుత్వ పత్రాల ప్రామాణికతపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందని అన్నారు

-తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు అనేక రకాల ప్రభుత్వ సేవలను మీసేవ కేంద్రాలు అందిస్తున్నాయి. మీసేవ సర్టిఫికెట్ల ప్రింటింగ్ కోసం 2011 నుండి ఒకే రకమైన సెక్యూరిటీ పేపర్ను ఉపయోగిస్తున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆ పాత విధానాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ, ప్రస్తుత సాంకేతికతకు అనుగుణంగా మెరుగైన క్వాలిటీ, సెక్యూరిటీ, మన్నిక కలిగిన కొత్త పేపర్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ముఖ్యంగా జీవితాంతం భద్రపరుచుకోవాల్సిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు ఈ #కొత్త పేపర్ ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

 

కొత్త వాటితో మెరుగైన మన్నిక వల్ల పౌరులు ముఖ్యమైన సర్టిఫికెట్లను సంవత్సరాల తరబడి భద్రపరచుకోగలుగుతారు. ఈ మెరుగైన కాగితం లామినేషన్ అవసరాన్ని కూడా తగ్గిస్తుందని భావిస్తున్నారు. దీనివల్ల పౌరులకు ఎక్కువ సౌకర్యం కలుగుతూనే.. వారి పత్రాలను దీర్ఘకాలం పాటు భద్రపరచడంలో సహాయపడుతుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ కాగితం మెరుగైన నాణ్యత, భద్రత, మన్నికను అందించే ఒక నూతన పరిష్కారంతో ప్రస్తుతమున్న దాని స్థానాన్ని భర్తీ చేస్తుంది. పౌరులు దీర్ఘకాలం పాటు భద్రపరచుకోవాల్సిన జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఇతర ముఖ్యమైన ప్రభుత్వ పత్రాలకు ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉండనుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!