నిజామాబాద్,జూన్ 02(పీపుల్స్ డైరీ)
నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 2026–27 సంవత్సరానికి సంబంధించిన నూతన బ్యాచ్ CRMI (Compulsory Rotating Medical Internship) ఇంటర్న్‌ల కోసం అవగాహన మరియు ఓరియంటేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. కృష్ణ మోహన్ ముఖ్య అతిథిగా హాజరై ఇంటర్న్‌లను ఉద్దేశించి ప్రసంగించారు. వైద్య విద్య పూర్తి చేసి ప్రజాసేవలో అడుగుపెడుతున్న ఈ దశలో బాధ్యత, క్రమశిక్షణ, వైద్య నైతిక విలువలు పాటించాలని ఆయన సూచించారు.ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డా. బి.వి. నాగ మోహన్ స్వాగతం పలుకుతూ, ఇంటర్న్‌లు రోగుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని, ఆసుపత్రి నిబంధనలు, విధులు మరియు వైద్య నైతికతను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు డా. శ్రీకాంత్, డా. రవికిరణ్, డా. రాజశేఖర్ పాల్గొన్నారు. అలాగే వైస్ ప్రిన్సిపాళ్లు డా. కె.జె. కిషోర్ కుమార్, డా. జె. తిరుపతి రావు, డా. విజయ్ కుమార్, డా. అరుణ రేఖ, డా. సలీం, డా. రమణ, డా. ఇమ్రాన్, డా. శివకృష్ణ తమ తమ విభాగాలలో ఇంటర్న్‌ల విధులు, బాధ్యతలు, రోగుల సంరక్షణ విధానం, అత్యవసర సేవలు, మెడికో-లీగల్ అంశాలు, వైద్య నైతిక విలువలు మరియు ఆసుపత్రి సేవా ప్రమాణాలపై సమగ్ర అవగాహన కల్పించారు.కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విభాగాధిపతులు మరియు నూతన ఇంటర్న్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఓరియంటేషన్ కార్యక్రమం ఇంటర్న్‌లకు వారి విధులపై స్పష్టమైన అవగాహన కల్పించి, బాధ్యతాయుతమైన వైద్యులుగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
