ఈ నెల 9న నల్లబెల్లికి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్
* దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న కేసీఆర్
* 9, 10 తేదీల్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ది సంస్మరణ సభలు
* 9న హాజరుకానున్న కేటీఆర్.. 10న హాజరుకానున్న హరీష్ రావు
నల్లబెల్లి:పీపుల్స్ డైరీ
భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈ నెల 9వ తేదీన నల్లబెల్లి మండల కేంద్రానికి రానున్నారు. ఇటీవల తుదిశ్వాస విడిచిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఆయన నేరుగా పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి నివాళులర్పించనున్నారు.దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీలలో రెండు రోజుల పాటు సంస్మరణ సభలను ఘనంగా నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఈ నెల 9వ తేదీన నిర్వహించే సంస్మరణ సభకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఈ నెల 10వ తేదీన జరగబోయే సంస్మరణ సభకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హాజరుకానున్నారు.ఈ కార్యక్రమాలకు సంబంధించిన భద్రతా, రవాణా మరియు వేదిక ఏర్పాట్లను స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు ముమ్మరంగా పర్యవేక్షిస్తున్నారు.
