ePaper
Saturday, July 11, 2026
ePaper
Home Blog Page 7

రాంపూర్ ఐకెపి సెంటర్ లో వడ్లను వెంటనే తరలించాలి: సిపిఐ డిమాండ్ 

0

రాంపూర్ ఐకెపి సెంటర్ లో వడ్లను వెంటనే తరలించాలి: సిపిఐ డిమాండ్

  • రైతుల విజ్ఞప్తి మేరకు ఐకెపి కేంద్రాన్ని సందర్శించిన సిపిఐ బృందం
  • మిల్లుల నిర్లక్ష్యంపై అధికారుల తక్షణ చర్యలకు విజ్ఞప్తి

నల్లబెల్లి, మే 31: పీపుల్స్ డైరీ 

నల్లబెల్లి మండలంలోని రాంపూర్ ఐకెపి (IKP) సెంటర్ లో కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు వచ్చినప్పటికీ, మిగిలి ఉన్న వరి ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు చింతకింది కుమారస్వామి డిమాండ్ చేశారు. రాంపూర్ ఐకెపి సెంటర్ లోని ధాన్యాన్ని సిపిఐ మండల కార్యదర్శి బట్టు సాంబయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి మామిళ్ల పెద్ద ఐలయ్య, మండల నాయకులు పరికి కోర్నేలులతో కూడిన బృందం ఆదివారం పరిశీలించింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఐకెపి సెంటర్ లో సుమారు 20 మంది రైతులకు సంబంధించిన 3-4 లారీల వరి ధాన్యం కాంటాలు (తూకం) పూర్తయినప్పటికీ వారాల తరబడి అక్కడే మూలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మిల్లుల కొరత – రైతుల ఆవేదన:

ప్రభుత్వం ఈ ధాన్యాన్ని రాజుపేట సమీపంలోని హేమాత రైస్ మిల్లు, శనిగరం దగ్గర ఉన్న భార్గవి రైస్ మిల్లులకు కేటాయించిందని.. అయితే సదరు మిల్లుల నిర్వాహకులు “ధాన్యం నిలువ చేసుకోవడానికి స్థలం లేదు” అనే నెపంతో దిగుమతి చేసుకోవడం లేదని రైతులు సిపిఐ బృందం దృష్టికి తెచ్చారు. మిల్లులు నిరాకరించడం వల్లే లారీల్లోకి ధాన్యాన్ని లోడ్ చేయడం లేదని వారు వాపోయారు.

ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి:

ఇదే సమయంలో హరికృష్ణ రైస్ మిల్లుకు ఈ సెంటర్ నుండి ఐదు లారీల ధాన్యాన్ని పంపించినట్లు ఐకెపి నిర్వాహకులు తెలిపారని సిపిఐ నాయకులు పేర్కొన్నారు. కాబట్టి అధికారులు స్పందించి, ధాన్యాన్ని హరికృష్ణ రైస్ మిల్లుకు లేదా ఇతర ప్రత్యామ్నాయ మిల్లులకు తరలించేందుకు తక్షణ అనుమతులు మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వాతావరణ మార్పుల నేపథ్యంలో హఠాత్తుగా గాలులు, వర్షం వస్తే ధాన్యం తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఐక్య సంఘం నిర్వాహకులు బచ్చు మణమ్మ, చింతల స్వరూప, ఆవాల సరోజన, పొనుగోటి సమ్మక్కతో పాటు రైతులు ఆవాల సంపత్ రావు, బొజ్జ కవిత, వలి భాష, జి. సంపత్ రావు, పురం స్వామి, యస్. శ్రీనివాసరావు, కర్మిడ్ల అంతయ్య, ఎం. మాధవరావు, గుండు కె. సోమన్న తదితరులు పాల్గొన్నారు

అధికారం రాగానే మారిన నైజం.. నల్లబెల్లిలో పట్టించుకోని పాలకులు!

0

నల్లబెల్లి:పీపుల్స్ డైరీ

నల్లబెల్లి మండల కేంద్రంలో పందుల సంచారం, దుర్వాసనపై నాటి విపక్ష నేతలు, నేటి పాలకులు ప్రదర్శిస్తున్న ద్వంద్వ వైఖరిపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అధికారంలో లేనప్పుడు ఊరిలో పందుల వల్ల కంపు కొడుతోందని, ప్రజలు రోగాల బారిన పడుతున్నారని నాడు నల్లబెల్లి తహసీల్దార్‌కు స్వయంగా లేఖలు ఇచ్చి హడావుడి చేసిన నాయకులు… నేడు అధికారం చేతికి వచ్చాక ఆ సమస్యను పూర్తిగా విస్మరించడం గమనార్హం.

నాడు తహసీల్దార్‌కు ఫిర్యాదు.. నేడు నిమ్మకు నీరెత్తినట్లు!

గతంలో పందుల సమస్యపై అప్పటి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన వార్డు మెంబర్, సర్పంచ్.. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఆ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు.నాడు పందుల సంచారం వల్ల ఊరంతా కంపు కొడుతోందని, ప్రజల ఆరోగ్యం పాడవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.నేడు అధికారం చేతుల్లో ఉన్నా, సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నా కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఎక్కడ?

పదవులు లేనప్పుడు ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నట్లు నటించి, తీరా అధికారంలోకి వచ్చాక అదే సమస్యలను గాలికి వదిలేయడం ఏంటని నల్లబెల్లి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక సర్పంచ్, వార్డు సభ్యులు స్పందించి, గతంలో తాము ఇచ్చిన లేఖను గుర్తుచేసుకుని, నల్లబెల్లి గ్రామంలో పందుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

వెంటనే చర్యలు తీసుకోవాలి..

నల్లబెల్లి గ్రామంలో పందుల సంచారం వల్ల తీవ్రమైన దుర్వాసన వస్తోంది, దీనివల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఈ సమస్యపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దయచేసి బాధ్యులైన అధికారులు వెంటనే స్పందించి, పందుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవలసిందిగా కోరుతున్నాను. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.”

పొడేటి కిషోర్. గ్రామస్థుడు

🎖️ ఇండియన్ ఆర్మీలో ‘నల్లబెల్లి’ ముద్దుబిడ్డ ఘన విజయం! 🎖️

0

🎖️ ఇండియన్ ఆర్మీలో ‘నల్లబెల్లి’ ముద్దుబిడ్డ ఘన విజయం!

పీపుల్స్ డైరీ నల్లబెల్లి

నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ముత్యాల సాయి కుమార్ అగ్నివీర్ జిడిగా (Agniveer GD) ఎంపికై సరిహద్దుల్లో దేశ సేవ చేయడానికి సిద్ధమయ్యాడు.ఇటీవల విడుదలైన ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ఫలితాలలో వరంగల్ జిల్లా, నల్లబెల్లి మండలం, నల్లబెల్లి గ్రామానికి చెందిన M. సాయి కుమార్ (M. SAI KUMAR) అద్భుత ప్రతిభ కనబరిచి, అగ్నివీర్ GD (General Duty) గా ఉద్యోగం సాధించాడు. ఘన్‌పూర్ స్టేషన్ లోని ‘అగ్నివీర్ డిఫెన్స్ అకాడమీ’ లో ఉచితంగా ఎగ్జామ్ మరియు గ్రౌండ్ శిక్షణ పొందిన సాయి కుమార్, తన కష్టాన్ని నమ్ముకుని తొలి ప్రయత్నంలోనే ఈ ఘన విజయాన్ని అందుకున్నాడు.ఈ సందర్భంగా అకాడమీ నిర్వాహకులు, గ్రామస్తులు మరియు మిత్రులు సాయి కుమార్ నివాసానికి చేరుకుని శాలువాతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

*గ్రామస్తుల హర్షం:* 

మన నల్లబెల్లి మట్టిలో పుట్టిన యువకుడు దేశాన్ని రక్షించే ఆర్మీ ఉద్యోగానికి ఎంపిక కావడం పట్ల స్థానిక ప్రజలు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది గ్రామీణ యువతకు సాయి కుమార్ విజయం ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు.సరిహద్దుల్లో భారత మాత సేవకు అడుగుపెడుతున్న M. సాయి కుమార్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరారు.

వరంగల్ నగరంలో భారీ జాతీయ జెండా కి అవమానం

0

వరంగల్ నగరంలో భారీ జాతీయ జెండా కి అవమానం

పీపుల్స్ డైరీ వరంగల్ : వవరంగల్ మున్సిపల్ పరిధిలో పోతన నగర్ భద్రకాళి బండ్ ప్రాంతంలోని బారీ ఎత్తున ఉన్న జాతీయ జెండాను ప్రస్తుతం పట్టించుకునే అధికారులు నిద్రావస్థలో ఉన్నట్టు గత కొన్ని రోజులుగా చిరిగిన జాతీయ జెండా ఎగురుతున్నప్పటికీ కంటికి కానరానట్టు వ్యవహరిస్తున్నారు అటుగా పదుల సంఖ్యలో అధికారులు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు అయినప్పటికీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారా లేదా నిర్లక్యం వహిస్తున్నారా అని వాదనలు వినపడుతున్నాయి భారత జాతీయ పతాకం ( త్రివర్ణ పతాకం ) అనేది దేశానికి అత్యున్నత గౌరవ చిహ్నం చిరిగిన జెండాను ఎగరవేయడం చట్టరీత్యా నేరం జెండాను అవమానించినట్టే నిబంధనల ప్రకారం చినిగిన జాతీయ జెండాను దహనం చేయాలి లేదా పాతి పెట్టవలసి వస్తుంది జెండా పవిత్రతకు భంగం కలగకుండా చూడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పవిత్ర జాతీయ పతాకాన్ని మార్చి గౌరవాన్ని కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు.

రేలకుంటలో కాకతీయ, శ్రీ చైతన్య గ్రామైక్య మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

0

నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామంలో కాకతీయ, శ్రీ చైతన్య గ్రామైక్య మహిళా సంఘం (VO) నూతన భవన నిర్మాణానికి నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఘనంగా శంకుస్థాపన చేశారు. రూ. 10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ఆయన భూమిపూజ చేసి, పనులను ప్రారంభించారు.

గ్రామాల్లోని మహిళా సంఘాల బలోపేతానికి, మహిళలు ఒకచోట చేరి తమ ఆర్థిక ప్రణాళికలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి ఈ సొంత భవనం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ, మండల మరియు గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు స్థానిక మహిళలు, ఐకేపీ (IKP) సిబ్బంది పాల్గొన్నారు.

ముచింపుల గ్రామంలో మహిళా సంఘం (VO) భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

0

నల్లబెల్లి మండలం ముచింపుల గ్రామంలో మహిళా సంఘం (VO) నూతన భవన నిర్మాణానికి నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఘనంగా శంకుస్థాపన చేశారు. రూ. 10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ఆయన భూమిపూజ చేసి, పనులను ప్రారంభించారు.

గ్రామాల్లోని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి, వారి సమాఖ్య సమావేశాలు మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ సొంత భవనం ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ, మండల మరియు గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు స్థానిక మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అర్షన్ పల్లి (బోల్లోనిపల్లి) లో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

0

నల్లబెల్లి: నల్లబెల్లి మండలం అర్షన్ పల్లి (బోల్లోనిపల్లి) గ్రామంలో నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణానికి నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఘనంగా శంకుస్థాపన చేశారు. రూ. 12 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న పిల్లలకు పౌష్టికాహారం, ముందస్తు విద్యను అందించడంతో పాటు గర్భిణీలు, బాలింతలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నూతన భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ, మండల మరియు గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

బుచ్చిరెడ్డిపల్లిలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

0

నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లి గ్రామంలో నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణానికి నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఘనంగా శంకుస్థాపన చేశారు. రూ. 12 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.గ్రామంలోని చిన్న పిల్లలకు, గర్భిణీలకు మెరుగైన సేవలు అందించేందుకు మరియు అంగన్‌వాడీ కేంద్రం మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు నర్సంపేట నియోజకవర్గ, మండల మరియు గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

కొండాపూర్‌లో మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

0

నల్లబెల్లి, మే 30: నల్లబెల్లి మండలం కొండాపూర్ గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శనివారం నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఘనంగా శంకుస్థాపన చేశారు. రూ. 10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ఆయన భూమిపూజ చేసి, పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉ ప సర్పంచ్‌తో పాటు నర్సంపేట నియోజకవర్గ, మండల మరియు గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల సాధికారతకు, వారి సమావేశాలు నిర్వహించుకోవడానికి ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

వడదెబ్బ మృతుల నమోదు శూన్యం

0

నల్లబెల్లి మండలంలో వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినప్పటికీ, సరైన అవగాహన లేక ఒక్క కేసు కూడా ఇప్పటివరకు నమోదు కాలేదు. వడదెబ్బ మరణంగా గుర్తించేందుకు పోస్టుమార్టం నిర్వహించడం తప్పనిసరి. తహసీల్దార్, ఎస్సై, వైద్యాధికారి సభ్యులుగా ఉండే త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా పరిహారం మంజూరవుతుంది. అయితే సమాచారం లేక బాధిత కుటుంబాలు ముందుకు రాకపోవడంతో అర్హులు ప్రభుత్వ సాయానికి దూరమవుతున్నారని అధికారులు చెబుతున్నారు.

error: Content is protected !!