ePaper
Saturday, July 11, 2026
ePaper
Home Blog Page 6

భవనం పై నుంచి పడి సెంట్రింగ్ కార్మికుడు మృతి

0

భవనం పై నుంచి పడి సెంట్రింగ్ కార్మికుడు మృతి

మేడ్చల్, జూన్ 4(పీపుల్స్ డైరీ):- మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవోదయ వెంచర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో సెంట్రింగ్ పనులు నిర్వహిస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు పై అంతస్తు నుంచి కిందపడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు, భవనం మూడో అంతస్తులో సెంట్రింగ్ పనులు చేస్తుండగా కార్మికుడు అదుపుతప్పి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవర రవిగా గుర్తించారు. అతను హైదరాబాద్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

భవనం పై నుంచి పడి సెంట్రింగ్ కార్మికుడు మృతి

0

భవనం పై నుంచి పడి సెంట్రింగ్ కార్మికుడు మృతి

మేడ్చల్, జూన్ 4(పీపుల్స్ డైరీ):- మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవోదయ వెంచర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో సెంట్రింగ్ పనులు నిర్వహిస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు పై అంతస్తు నుంచి కిందపడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు, భవనం మూడో అంతస్తులో సెంట్రింగ్ పనులు చేస్తుండగా కార్మికుడు అదుపుతప్పి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవర రవిగా గుర్తించారు. అతను హైదరాబాద్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఘనంగా హరీష్ రావు బర్త్‌డే వేడుకలు: యువతకు క్రికెట్ కిట్ అందజేత!

0

ఘనంగా హరీష్ రావు బర్త్‌డే వేడుకలు: యువతకు క్రికెట్ కిట్ అందజేత!

ఖండాంతరాల్లో ఉన్నా వీడని అభిమానం.. యూకే NRI అంజన్ రావు నల్లబెల్లి సౌజన్యం

(నల్లబెల్లి), జూన్ 03:

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా నల్లబెల్లి మండలం, కొండాయిలపల్లి గ్రామంలో యువతకు క్రికెట్ కిట్‌ను అందజేశారు. BRS ఎన్నారై యూకే ప్రతినిధి అంజన్ రావు నల్లబెల్లి సౌజన్యంతో సమకూరిన ఈ కిట్‌ను, బీఆర్ఎస్ యూత్ నాయకుడు తెలంగాణ విజయ్ గ్రామ యువతకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎన్నారై అంజన్ రావు మాట్లాడుతూ… తాము ఖండాంతరాల్లో ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రం పట్ల, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, హరీష్ రావు గారిపై ఉన్న అభిమానంతోనే యువతను ప్రోత్సహించడానికి ఈ క్రికెట్ కిట్ అందజేసినట్లు తెలిపారు. నిబద్ధత గల నాయకుడి పుట్టినరోజున ఇలాంటి కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు.

“మాకు క్రికెట్ కిట్ అందజేసి అండగా నిలిచిన ఎన్ఆర్ఐ అంజన్ రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.”

— గ్రామ యువత, కొండాయిలపల్లి

ఘనంగా కేక్ కటింగ్ వేడుకలు..

హరీష్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామ యువత సమక్షంలో తెలంగాణ విజయ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిండ్ల గోపి, ఎద్దు హరిమోహన్, ఎద్దు రంజిత్, ఎద్దు రాము, ముస్కు హరీష్, వీరమళ్ళ రజినీకర్, రణధీర్ మరియు స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నిజామాబాద్‌లో నూతన ఇంటర్న్‌లకు ఘనంగా అవగాహన కార్యక్రమం

0

నిజామాబాద్,జూన్ 02(పీపుల్స్ డైరీ)

నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 2026–27 సంవత్సరానికి సంబంధించిన నూతన బ్యాచ్ CRMI (Compulsory Rotating Medical Internship) ఇంటర్న్‌ల కోసం అవగాహన మరియు ఓరియంటేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. కృష్ణ మోహన్ ముఖ్య అతిథిగా హాజరై ఇంటర్న్‌లను ఉద్దేశించి ప్రసంగించారు. వైద్య విద్య పూర్తి చేసి ప్రజాసేవలో అడుగుపెడుతున్న ఈ దశలో బాధ్యత, క్రమశిక్షణ, వైద్య నైతిక విలువలు పాటించాలని ఆయన సూచించారు.ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డా. బి.వి. నాగ మోహన్ స్వాగతం పలుకుతూ, ఇంటర్న్‌లు రోగుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని, ఆసుపత్రి నిబంధనలు, విధులు మరియు వైద్య నైతికతను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు డా. శ్రీకాంత్, డా. రవికిరణ్, డా. రాజశేఖర్ పాల్గొన్నారు. అలాగే వైస్ ప్రిన్సిపాళ్లు డా. కె.జె. కిషోర్ కుమార్, డా. జె. తిరుపతి రావు, డా. విజయ్ కుమార్, డా. అరుణ రేఖ, డా. సలీం, డా. రమణ, డా. ఇమ్రాన్, డా. శివకృష్ణ తమ తమ విభాగాలలో ఇంటర్న్‌ల విధులు, బాధ్యతలు, రోగుల సంరక్షణ విధానం, అత్యవసర సేవలు, మెడికో-లీగల్ అంశాలు, వైద్య నైతిక విలువలు మరియు ఆసుపత్రి సేవా ప్రమాణాలపై సమగ్ర అవగాహన కల్పించారు.కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విభాగాధిపతులు మరియు నూతన ఇంటర్న్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఓరియంటేషన్ కార్యక్రమం ఇంటర్న్‌లకు వారి విధులపై స్పష్టమైన అవగాహన కల్పించి, బాధ్యతాయుతమైన వైద్యులుగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.

 

ముచ్చింపుల తండ గ్రామ పంచాయతీలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

0

ముచ్చింపుల తండ గ్రామ పంచాయతీలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

పీపుల్స్ డైరీ నల్లబెల్లి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముచ్చింపుల తండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మచ్చిక రవీందర్ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, దిలీప్ (గ్రామ పంచాయతీ సెక్రెటరీ),చంద్రశేఖర్ సార్ (ప్రైమరీ స్కూల్ టీచర్),రాజమ్మ (అంగన్వాడీ టీచర్),రమ (అంగన్వాడీ ఆయా),సరిత (ఆశా వర్కర్),మరియు గ్రామస్తులు నవీన్, వీరారెడ్డి, రాజేందర్, ప్రవళికతో పాటు తండ్ర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ ఫార్మేషన్ డే సంబరాలను జరుపుకున్నారు

గాంధీనగర్ గ్రామ పేదలకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ: లక్ష్మీస్ అమ్మ ఫౌండేషన్, జెన్‌కో కానిస్టేబుల్స్ ఉదారత

0

గాంధీనగర్ గ్రామ పేదలకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ: లక్ష్మీస్ అమ్మ ఫౌండేషన్, జెన్‌కో కానిస్టేబుల్స్ ఉదారత

*పీపుల్స్ డైరీ*భూపాలపల్లి (గాంధీనగర్):**

కష్టాల్లో ఉండి సహాయం కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలను ఆదుకోవడం అభినందనీయమని గాంధీనగర్ గ్రామ సర్పంచ్ ఇంజపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం గాంధీనగర్ గ్రామంలో పేదరికంలో మగ్గుతున్న తూముల భూమామ్మ, సెగ్గం వెంకటేష్ అనే లబ్ధిదారులకు **HELP TO NEEDY** గ్రూప్ (తెలంగాణ జెన్‌కో కానిస్టేబుల్స్ ఆధ్వర్యంలో) మరియు **లక్ష్మీస్ అమ్మ ఫౌండేషన్ (Laxmi’s AMMA FOUNDATION)** సంయుక్తంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశాయి.గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఒక రేషన్ కిట్ (Ration Kit) తో పాటు, లక్ష్మీస్ అమ్మ ఫౌండేషన్ తరఫున 25 కిలోల బియ్యం బస్తాను అందజేశారు.

 

 111 మందికి పైగా అండగా…

 

గత కొన్ని సంవత్సరాలుగా భూపాలపల్లి ప్రాంతంలో సరైన వసతులు లేక, సహాయం కోసం ఎదురుచూస్తున్న దాదాపు 111 మంది నిరుపేదలను లక్ష్మీస్ అమ్మ ఫౌండేషన్ గుర్తించి, వారికి నిరంతరం అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.పేదరికంలో ఉన్నవారిని గుర్తించి సకాలంలో స్పందించి సహాయం చేయడం గొప్ప విషయం. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని గ్రామ సర్పంచ్ ఇంజపల్లి శ్రీనివాస్ తెలిపారు..ఈ పంపిణీ కార్యక్రమంలో లక్ష్మీస్ అమ్మ ఫౌండేషన్ నిర్వాహకులు చింతనిప్పుల వెంకన్న, గ్రామ సర్పంచ్ ఇంజపల్లి శ్రీనివాస్, సెగ్గం శ్రీనివాస్, తెలంగాణ జెన్‌కో కానిస్టేబుల్స్ మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

 

రంగాపురం గ్రామపంచాయతీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0

రంగాపురం గ్రామపంచాయతీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగాపురం గ్రామపంచాయతీ ఆవరణంలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్  ఓరుగంటి మాధురి రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమర వీరులను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకు రావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం పరిరక్షణ మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కస్తూరోజు రామ్మూర్తి, వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి రామారావు గారు, గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, యువకులు, మహిళలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.దేశభక్తి నినాదాలతో గ్రామపంచాయతీ కార్యాలయ పరిసరాలు మార్మోగగా వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.

ఇందిరమ్మ ఇండ్లు దేశానికి ఆదర్శం వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

0

ఇందిరమ్మ ఇండ్లు దేశానికి ఆదర్శం వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

ఏన్కూర్, జూన్ 1 పీపుల్స్ డైరీ

ఏన్కూర్ మండలంలోని జన్నారం ఎస్టీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడు ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకొని ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లచ్చిరాం నాయక్,ఎంపీడీవో పల్లి భాగ్యశ్రీ, ఎంపీఓ జీఎస్ నారాయణ, హౌసింగ్ ఏఈ స్నేహలత, ఎస్సై సంధ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీలత, సర్పంచ్ బానోతు మనీ, ఉప సర్పంచ్ చింతల నరసరావు, మండల పార్టీ అధ్యక్షుడు స్వర్ణ నరేందర్, మాజీ ఎంపీటీసీ మేడ ధర్మారావు, వాసిరెడ్డి నాగేశ్వరావు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

 

కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తి బీజేపీయే: గోగుల రాణా ప్రతాప్ రెడ్డి*

0

**కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తి బీజేపీయే: గోగుల రాణా ప్రతాప్ రెడ్డి**

రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయ శక్తి బీజేపీయేనని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు.ముచ్చింపుల గ్రామంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ అధ్యక్షతన, గ్రామ పార్టీ అధ్యక్షులు ధర్మారం క్రాంతికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో, రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో పలువురు ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరారు.
BRS పార్టీ నుండి మండల సీనియర్ నాయకులు కక్కెర్ల సురేష్, కొత్తపెల్లి మధుకర్, శీలం ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులు నడిగొట్టు దర్మేందర్. బీజేపీ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి రాణా ప్రతాప్ రెడ్డి  కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

### **రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య వ్యాఖ్యలు:**

> “గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చాయి. ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజలను వంచించాయి. నియోజకవర్గంలో బీజేపీ పటిష్టమైన నాయకత్వం పట్ల నమ్మకంతోనే ఇతర పార్టీల సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరుతున్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు బత్తిని కుమారస్వామి గౌడ్, సింగిరెడ్డి యాదగిరి, మండల నాయకులు వల్లే పర్వాతలు, కక్కెర్ల సమయ్య, బత్తిని మల్లికార్జున్, ములుక రాజేష్, మార్తా రవీందర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

పుణ్యజలాల్లో పరవశించిన భక్తజనం…

0

పుణ్యజలాల్లో పరవశించిన భక్తజనం

– 11వ రోజు త్రివేణి సంగమం వద్ద భక్తి వెల్లువ
– పుణ్యస్నానాలతో మార్మోగిన కాళేశ్వరం
– ఆదివారం కావడంతో భారీగా పెరిగిన యాత్రికుల రద్దీ
– ఆధ్యాత్మిక కాంతులతో శోభిల్లిన కాళేశ్వరం
– సంగమంలో స్నానాలు… స్వామి దర్శనాలకు క్యూలైన్లు

కాళేశ్వరం (భూపాలపల్లి), మే 31 (పీపుల్స్ డైరీ):

“కాళేశ్వర నివాసోవా, కాళేశ్వర నీరిక్షణం, కాళేశ్వరస్య స్మరణం సర్వపాప వినాశనం” అంటూ భక్తి పారవశ్యంతో జపిస్తూ వేలాదిమంది భక్తులు కాళేశ్వరం త్రివేణి సంగమ తీరాన పవిత్ర సరస్వతి అంత్య పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. పుష్కరాల 11వ రోజు ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో త్రివేణి సంగమం భక్తులతో కిక్కిరిసి భక్తి సముద్రాన్ని తలపించింది. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి నదుల సంగమ క్షేత్రమైన త్రివేణి సంగమంలో తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి నెలకొంది. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు పుష్కర ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి, పితృతర్పణాలు, గోదానాలు, దానధర్మాలు నిర్వహించారు. అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నదిలో స్నానమాచరించడం ద్వారా పాపాలు నశించి పుణ్యఫలం లభిస్తుందనే విశ్వాసంతో భక్తులు ఉత్సాహంగా స్నానాలు చేశారు. త్రివేణి సంగమ పరిసరాలు “హర హర మహాదేవ”, “జై కాళేశ్వర ముక్తీశ్వర స్వామి” నామస్మరణలతో మార్మోగిపోయాయి. పుష్కర స్నానాల అనంతరం భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, ఘాట్లు, ప్రధాన రహదారులు భక్తులతో నిండిపోవడంతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తుల భద్రతకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పుష్కర ఘాట్ల వద్ద నదిలో లోతైన ప్రాంతాలకు భక్తులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రమాదాల నివారణకు గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, సింగరేణి రెస్క్యూ బృందాలను మోహరించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు బోట్లు సిద్ధంగా ఉంచడంతో పాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, వైద్య, అగ్నిమాపక శాఖల సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. పుష్కరాల చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతుండగా, త్రివేణి సంగమం ఆధ్యాత్మిక కాంతులతో, భక్తుల గోవింద నామస్మరణలతో మరింత శోభాయమానంగా మారిందని అధికారులు తెలిపారు. 11వ రోజు కూడా ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పుష్కర స్నానాలు కొనసాగడం విశేషం.

error: Content is protected !!