ePaper
Saturday, July 11, 2026
ePaper
Home Blog Page 5

గాంధీనగర్‌లో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

0

గాంధీనగర్‌లో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

రెండు స్వచ్ఛంద సంస్థల సేవా దృక్పథం అభినందనీయం: సర్పంచ్ డా. ఇంజపల్లి శ్రీనివాస్

గణపురం: పీపుల్స్ డైరీ

‘హెల్ప్ టు నీడీ’ (Help to Needy) మరియు ‘లక్ష్మి అమ్మ ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా గాంధీనగర్ గ్రామాన్ని దత్తత తీసుకొని, గత నెల రోజులుగా గ్రామంలోని నిరుపేదలకు అండగా నిలుస్తున్నాయి. ఇందులో భాగంగా గురువారం (11-06-2026) గ్రామానికి చెందిన ఇద్దరు నిరుపేద మహిళలు సెగ్గం విజయలక్ష్మి, పూరెళ్ల అమృతమ్మ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5,000 విలువ చేసే నిత్యావసర సరుకులను, బియ్యాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గాంధీనగర్ సర్పంచ్ డా. ఇంజపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… ఎలాంటి లాభాపేక్ష లేకుండా, నిస్వార్థంగా గ్రామంలో సేవలు అందిస్తున్న రెండు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను మనస్ఫూర్తిగా అభినందించారు.

“సమాజంలో పేదరికాన్ని నిర్మూలించడానికి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షణీయం. ఇంకా ఎవరైనా దాతలు లేదా సి.ఎస్.ఆర్ (CSR) ఫండ్స్ అందించే కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి ‘లక్ష్మి అమ్మ ఫౌండేషన్’, ‘హెల్ప్ టు నీడీ’ సంస్థలకు ఆర్థిక సహాయం అందించాలి. తద్వారా వీరి సేవలను మరింత విస్తృతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి” అని సర్పంచ్ కోరారు.ఈ సేవా కార్యక్రమంలో సర్పంచ్ డా. ఇంజపల్లి శ్రీనివాస్‌తో పాటు మాజీ సింగిల్ విండో డైరెక్టర్ సెగ్గం శ్రీనివాస్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సమస్యలు ఎదురైతే నా దృష్టికి తీసుకురండి: డీసీపీ అంకిత్

0
  • ఇటుకాలపల్లి గ్రామ సభలో అనూహ్యంగా హాజరైన డీసీపీ

గ్రామాల్లో శాంతి భద్రతల సమస్యలు పరిష్కారమైతే సమాజంలో క్రమక్రమంగా సానుకూల ప్రభావం కనిపిస్తుందని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ అన్నారు.ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామ సభకు ఆయన అనూహ్యంగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఏర్పడే శాంతి భద్రతల సమస్యలు, సైబర్ మోసాలు తదితర అంశాలను తన దృష్టికి తీసుకురావచ్చని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. పోలీసులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. పౌర భద్రతను కాపాడటం ప్రతి పోలీస్ బాధ్యత అని తెలిపారు.ఎస్సై అరుణ్, సీఐ శ్రీనివాస్ ప్రజలు రోజువారీ జీవితంలో పాటించాల్సిన భద్రతా నియమాలు, నిబంధనలపై అవగాహన కల్పించారు. వాహనదారులు ఇంటి నుంచి బయలుదేరిన వారు సురక్షితంగా తిరిగి ఇంటికి చేరాలని సూచిస్తూ “అరైవ్ అలైవ్” సందేశాన్ని వివరించారు.అనంతరం జరిగిన గ్రామ సభలో సర్పంచ్ మెరుగు సుమలత శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై ఎమ్మార్వో రవిచంద్రారెడ్డి సహా వివిధ శాఖల అధికారులు గ్రామస్తులతో చర్చించారు.గ్రామ అభివృద్ధికి సంబంధించిన సూచనలు, సలహాలను ప్రజల నుంచి స్వీకరించి వాటిని ప్రణాళికలో చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు.

 

జర్నలిస్టుల పిల్లల పాఠశాల ఫీజుల్లో 50% రాయితీ ఇవ్వాలి

0

– జిల్లా కలెక్టర్‌కు ‘టీఎస్జేయూ’ వినతి
– నిర్మల్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
– రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నరగౌని, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ నేతృత్వంలో కలెక్టర్‌తో భేటీ

నిర్మల్, జూన్ 10 (పీపుల్స్ డైరీ): జిల్లాలో అహర్నిశలు శ్రమిస్తూ ప్రజా సమస్యలపై వార్తా కథనాలు రాస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పెద్దపీట వేయాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్ జేయు) రాష్ట్ర కమిటీ కోరింది. బుధవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాను టీఎస్జేయూ రాష్ట్ర, జిల్లా నేతలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డా. పురుషోత్తం నరగౌని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు ఒక సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు. జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు స్థానిక కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల్లో 50 శాతం రాయితీ (కన్సిషన్) కల్పించేలా యాజమాన్యాలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ను కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

– నిర్మల్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

అంతకుముందు, నిర్మల్ జిల్లా టీఎస్జేయూ గత కార్యవర్గ కాలపరిమితి ముగియడంతో రాష్ట్ర కమిటీ పర్యవేక్షణలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా సిరిగే రమేష్, ఉపాధ్యక్షుడిగా గోగుర్ల సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాహుల్ గౌడ్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన నిర్మల్ జిల్లా బాధ్యులకు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నరగౌని, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా నూతన అధ్యక్షుడు సిరిగే రమేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల హక్కుల సాధన కోసం, వారి కుటుంబాల సంక్షేమం కోసం నూతన కార్యవర్గం అహర్నిశలు పనిచేస్తుందని, యూనియన్ జెండాను జిల్లాలో మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నేతలు, వర్కింగ్ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

ఉప సర్పంచ్‌ల ఫోరం జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా గుమ్మడి వేణు ఏకగ్రీవం

0

నల్లబెల్లి:

ఉప సర్పంచ్‌ల ఫోరం జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా నల్లబెల్లి గ్రామ ఉపసర్పంచ్ గుమ్మడి వేణు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఫోరం ప్రతినిధులు ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఉప సర్పంచులు ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.

చెక్ పవర్ పునరుద్ధరణే లక్ష్యం: గుమ్మడి వేణు

తన ఎన్నిక అనంతరం గుమ్మడి వేణు మాట్లాడుతూ… తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా, ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ పునరుద్ధరణ కోసం గట్టిగా పోరాడతానని స్పష్టం చేశారు.

గ్రామాల సర్వాంగీణ అభివృద్ధిలో ఉప సర్పంచ్‌ల పాత్ర ఎంతో కీలకమైనది. నిధులు, విధుల సాధన కోసం అందరినీ కలుపుకొని, సమష్టిగా ముందుకు సాగుతాం.”

 

— గుమ్మడి వేణు, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు.

 

బైపాస్‌కు బ్రేకులెందుకు..?

0

 

– ప్రజల ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించడం లేదా..?

– బాంబులగడ్డ–లక్ష్మారెడ్డిపల్లి వరకు ప్రతిపాదిత బైపాస్

– గత ప్రభుత్వంలోనే పూర్తైన అనుమతుల ప్రక్రియ

– వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలి

– రెండున్నరేళ్లుగా ముందుకు కదలని నిర్మాణ పనులు

– ట్రాఫిక్, ప్రమాదాల నివారణకు బైపాస్ అత్యవసరం

– లేకుంటే ప్రజలతో కలిసి ఉద్యమం తప్పదని హెచ్చరిక

– బీఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు పోరెడ్డి పూర్ణచంద్రా రెడ్డి

 

గణపురం, జూన్ 9 (పీపుల్స్ డైరీ):

 

జిల్లా కేంద్రం భూపాలపల్లిలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ప్రతిపాదించిన బైపాస్ రోడ్డు నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై, అన్ని రకాల పరిపాలనా అనుమతులు పొందిన ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుకు కదలకపోవడంపై గండ్ర యువసేన జిల్లా అధ్యక్షుడు, బీఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రజల అవసరాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులను రాజకీయ కోణంలో చూడడం సరికాదని, జిల్లా అభివృద్ధికి సంబంధించిన పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రత్యేక చొరవతో భూపాలపల్లి జిల్లా కేంద్రానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయించారని గుర్తు చేశారు. భూపాలపల్లి బాంబులగడ్డ నుంచి గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి వరకు నిర్మించనున్న ఈ బైపాస్‌కు అవసరమైన ఆర్థిక, రెవెన్యూ అనుమతులతో పాటు ఇతర శాఖల ఆమోదాలు కూడా లభించాయని తెలిపారు. ప్రాజెక్టు అమలుకు అన్ని అడ్డంకులు తొలగిపోయినప్పటికీ, ప్రస్తుతం పనులు ప్రారంభం కాకపోవడం వెనుక కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రం రోజురోజుకూ విస్తరిస్తోందని, వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా భారీ వాహనాలు పట్టణం గుండా ప్రయాణించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సేవలకు సంబంధించిన అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. పట్టణంలో ట్రాఫిక్ ఒత్తిడి పెరగడంతో పాటు రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా అధికమవుతోందని ఆయన పేర్కొన్నారు. బైపాస్ రోడ్డు అందుబాటులోకి వస్తే భారీ వాహనాల రాకపోకలు పట్టణానికి వెలుపలికి మళ్లి, ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రమాదాల నివారణకు కూడా దోహదపడుతుందని వివరించారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, అభివృద్ధి పనుల విషయంలో రాజకీయ కక్షసాధింపులకు తావు ఉండకూడదని అన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులను పక్కనపెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పేర్కొన్న ఆయన, భూపాలపల్లి ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న బైపాస్ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఈ అంశంపై స్పష్టత ఇచ్చి, పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో ప్రజలకు వెల్లడించాలని కోరారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసి ఉద్యమ బాట పడుతుందని, ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి హెచ్చరించారు. భూపాలపల్లి అభివృద్ధికి కీలకమైన బైపాస్ రోడ్డు నిర్మాణం ఇకపై మరింత ఆలస్యం కాకుండా వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.

భీకర భూకంపంతో ఫిలిప్పీన్స్‌ అతలాకుతలం

0
  • భీకర భూకంపంతో ఫిలిప్పీన్స్‌ అతలాకుతలం
  • కూలిన భవనాలు..
  • సునామీ హెచ్చరికలతో తీరప్రాంతాల్లో హై అలర్ట్

పీపుల్స్ డైరీ వెబ్​డెస్క్​ : దక్షిణ పసిఫిక్ మహాసముద్ర తీర దేశమైన ఫిలిప్పీన్స్‌లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం దేశాన్ని వణికించింది. ఒక్కసారిగా చోటుచేసుకున్న భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా భారీ ఆస్తి, ప్రాణనష్టం సంభవించి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

భూకంపం ప్రభావం ఫిలిప్పీన్స్‌లోని ప్రముఖ నగరమైన జనరల్ శాంటోస్‌లో తీవ్రంగా కనిపించింది. నగరంలోని పలు బహుళ అంతస్తుల భవనాలు, వ్యాపార సముదాయాలు, నివాస గృహాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. భూమి తీవ్రంగా కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు, రాత్రి విధుల్లో ఉన్న ఉద్యోగులు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. నగరమంతా అరుపులు, కేకలు, ఆందోళనలతో యుద్ధ వాతావరణాన్ని తలపించింది.

భూకంప కేంద్రం గుర్తింపు…

భూగర్భ శాస్త్రవేత్తల వివరాల ప్రకారం, జనరల్ శాంటోస్ నగరానికి నైరుతి దిశగా సుమారు 8 మైళ్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ ఉపరితలం నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ప్రకంపనలు సంభవించడంతో ఉపరితలంపై తీవ్ర ప్రభావం చూపినట్లు నిపుణులు వెల్లడించారు. తక్కువ లోతులో సంభవించిన భూకంపాల వల్లే సాధారణంగా నష్టం ఎక్కువగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

సునామీ ముప్పు.. తీరప్రాంతాలకు హెచ్చరిక

భూకంపం సముద్ర తీరానికి సమీపంలో సంభవించడంతో సునామీ ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. సముద్ర గర్భంలో ఏర్పడిన మార్పుల కారణంగా తీరప్రాంతాల్లో 10 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తీర ప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.

పొరుగుదేశాలకూ అప్రమత్త హెచ్చరికలు

ఈ భూకంప ప్రభావం ఫిలిప్పీన్స్‌కే పరిమితం కాకుండా ఆగ్నేయాసియా దేశాలపై కూడా పడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండోనేషియా, మలేషియా తీరప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయగా, కోస్ట్ గార్డ్ బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ముమ్మరంగా సహాయక చర్యలు

భూకంపం అనంతరం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సైన్యం, విపత్తు నిర్వహణ దళాలను రంగంలోకి దించింది. కూలిపోయిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు రాబోయే గంటల్లో ఆఫ్టర్ షాక్స్ సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్లలోకి వెళ్లకుండా బహిరంగ ప్రదేశాల్లోనే ఉండాలని అధికారులు సూచించారు.

ఫిలిప్పీన్స్‌లో సంభవించిన ఈ భీకర ప్రకృతి విపత్తు దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.

నిరుపేదలకు అండగా ‘లక్ష్మి అమ్మ ఫౌండేషన్’ & ‘హెల్ప్ టు నీడ్’ సంస్థలు*

0

*నిరుపేదలకు అండగా ‘లక్ష్మి అమ్మ ఫౌండేషన్’ & ‘హెల్ప్ టు నీడ్’ సంస్థలు*

  • భూపాలపల్లి జిల్లాలోని 125 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ*
  • గాంధీనగర్ సర్పంచ్ డా. ఇంజపల్లి శ్రీనివాస్ అభ్యర్థనతో గ్రామం దత్తత*

సమాజంలోని నిరుపేదలకు అండగా నిలవాలనే సంకల్పంతో ‘లక్ష్మి అమ్మ ఫౌండేషన్’ మరియు జెన్కో కానిస్టేబుల్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘హెల్ప్ టు నీడ్’ (Help to Need) స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 125 నిరుపేద కుటుంబాలకు రూ. 5,000 విలువచేసే 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు.

*గాంధీనగర్ గ్రామం దత్తత – దివ్యాంగుడి కుటుంబానికి సహాయం:*

గాంధీనగర్ సర్పంచ్ డా. ఇంజపల్లి శ్రీనివాస్ అభ్యర్థన మేరకు ఈ స్వచ్ఛంద సంస్థలు గాంధీనగర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నాయి. గడిచిన నెల రోజులుగా ఈ గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు రూ. 5,000 విలువైన నిత్యావసర సరుకులను అందిస్తూ ఆదుకుంటున్నారు. అందులో భాగంగా శనివారం (నిన్న) గ్రామానికి చెందిన తడుక అఖిల్ అనే దివ్యాంగుడి కుటుంబానికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ డా. ఇంజపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిరుపేదల ఆకలి తీర్చడమే పరమావధిగా జెన్కో కానిస్టేబుల్స్ నడుపుతున్న ‘హెల్ప్ టు నీడ్’ సంస్థ, అలాగే ‘లక్ష్మి అమ్మ ఫౌండేషన్’ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. కష్టకాలంలో పేద కుటుంబాలకు ఈ విధంగా సహాయం చేయడం గొప్ప విషయమన్నారు.ఈ సేవా కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో డైరెక్టర్ సెగ్గం శ్రీనివాస్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

ఆస్తి నేరాల నివారణపై ప్రజలకు అవగాహన

0

ఆస్తి నేరాల నివారణపై ప్రజలకు అవగాహన

ఏన్కూరు (పీపుల్స్ డైరీ) : ఇటీవల కాలంలో గృహ చోరీలు, రాత్రివేళ దొంగతనాలు మరియు ఇతర ఆస్తి సంబంధిత నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కల్లూరు డివిజన్ పోలీసు శాఖ ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు జారీ చేస్తోంది. ప్రతి పౌరుడు తమ ఇల్లు, కుటుంబం మరియు విలువైన ఆస్తుల రక్షణ కోసం క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మరియు రాత్రి నిద్రించే ముందు తలుపులు, కిటికీలు సక్రమంగా తాళం వేసి ఉన్నాయో నిర్ధారించుకోవాలి.
ఇంట్లో అధిక మొత్తంలో నగదు, బంగారం మరియు ఇతర విలువైన వస్తువులు నిల్వ ఉంచకుండా బ్యాంకు లాకర్లను వినియోగించాలి.
ఇంటి పరిసరాల్లో తగిన వెలుతురు ఉండేలా చూడాలి.
బలమైన తాళాలు, సెక్యూరిటీ డోర్లు మరియు ఇతర భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి.
అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలి.
ఇళ్లు, వ్యాపార సంస్థలు మరియు ఇతర ముఖ్య ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
బయట ప్రాంతాలకు వెళ్లే సమయంలో పొరుగువారికి లేదా బంధువులకు సమాచారం ఇవ్వాలి.

కల్లూరు డివిజన్ పోలీసుల చర్యలు: ఆస్తి నేరాల నివారణ మరియు గుర్తింపును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ క్రింది చర్యలను చేపడుతోంది:

* రాత్రి వేళల్లో ప్రత్యేక నైట్ పెట్రోలింగ్.
* గ్రామాలు, కాలనీలు మరియు ప్రధాన రహదారులపై మొబైల్ పెట్రోలింగ్.
* నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా.
* సీసీటీవీ ఫుటేజ్ విశ్లేషణ మరియు సాంకేతిక ఆధారాల సేకరణ.
* నేర ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు.

ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుంది. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా కార్యకలాపాల గురించి వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు లేదా డయల్-100 కు సమాచారం అందించాలని కల్లూరు ఏసిపి వసుంధర యాదవ్ కోరారు.

నింగిలో ప్రేమ సందేశం..

0
  • జూన్ 9న అరుదైన గ్రహాల కలయిక!
  • ఆకాశంలో అరుదైన ఖగోళ అద్భుతం..
  • ఖగోళ ప్రేమికులకు ఆనందకర వార్త
  • విశ్వచుంబనంగా నామకరణం…
  • మిస్​కాకుండా చూడండి…
  • మళ్లీ ఇలాంటి సందర్భం ఎప్పుడొస్తుందో తెలియదు

ఆకాశం ఎప్పుడూ మనిషిని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. నక్షత్రాల మెరుపులు, గ్రహాల సంచారాలు, గ్రహణాల అద్భుతాలు ఎన్నో చూసిన మన కళ్లకు ఇప్పుడు మరో అరుదైన దృశ్యం కనువిందు చేయబోతోంది. జూన్ 9న రాత్రి ఆకాశంలో శుక్రుడు (వీనస్), గురుడు (జూపిటర్) అత్యంత దగ్గరగా చేరి కనిపించనున్నాయి. ఈ అరుదైన ఖగోళ ఘటనను ఖగోళ శాస్త్రవేత్తలు “ప్లానెటరీ కంజంక్షన్”గా పేర్కొంటుండగా, జ్యోతిష్యవేత్తలు మాత్రం దీనిని “విశ్వ చుంబనం”గా అభివర్ణిస్తున్నారు.

సాధారణంగా గ్రహాలు తమ తమ కక్ష్యల్లో ప్రయాణిస్తుంటాయి. అయితే భూమి నుంచి చూసినప్పుడు కొన్నిసార్లు అవి ఒకదానికొకటి అత్యంత సమీపంలో ఉన్నట్లు కనిపిస్తాయి. అలాంటి అరుదైన సందర్భమే జూన్ 9న చోటుచేసుకోనుంది. ఈ రోజున శుక్రుడు, గురుడు మధ్య దూరం కేవలం 1.5 నుంచి 1.6 డిగ్రీల మేర మాత్రమే కనిపించనుంది. ఇది పౌర్ణమి చంద్రుడి వ్యాసార్థం కంటే సుమారు మూడు రెట్లు ఎక్కువైనా, భూమిపై ఉన్నవారికి ఈ రెండు గ్రహాలు దాదాపు పక్కపక్కనే మెరిసిపోతున్నట్లు అనిపిస్తాయి.

ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన ఖగోళ వస్తువులలో శుక్రుడు, గురుడు ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. అందుకే ఈ కలయిక మరింత ఆకర్షణీయంగా మారనుంది. సూర్యాస్తమయం అనంతరం పశ్చిమ-వాయువ్య దిశలో ఈ రెండు గ్రహాలు వెండి వెలుగులు చిందిస్తూ కనువిందు చేయనున్నాయి. టెలిస్కోప్ అవసరం లేకుండానే సాధారణ కంటితో స్పష్టంగా వీక్షించవచ్చు.

జ్యోతిష్య పరంగా కూడా ఈ ఘటనకు విశేష ప్రాధాన్యం ఉంది. కర్కాటక రాశిలో గురుడు, శుక్రుడు అత్యంత సమీపానికి రానున్నారు. పాశ్చాత్య సంస్కృతిలో వీనస్‌ను ప్రేమ, శృంగారానికి ప్రతీకగా భావిస్తారు. హిందూ జ్యోతిష్యంలో శుక్రుడు స్త్రీ గ్రహంగా, గురుడు పురుష గ్రహంగా పరిగణించబడతాడు. అందుకే ఈ రెండు గ్రహాల కలయికను “విశ్వ చుంబనం”గా వర్ణిస్తున్నారు.

ఈ ఖగోళ నాటకానికి మరో ఆసక్తికరమైన మలుపు కూడా ఉంది. జూన్ 11న బుధుడు కూడా ఈ రెండు గ్రహాలకు దగ్గరగా చేరి, జూన్ 15 వరకు వాటితో కలిసి కనిపించనున్నాడు. దీంతో పశ్చిమ దిక్కున మూడు గ్రహాలు ఒకే ప్రాంతంలో మెరిసే అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. అయితే బుధుడు సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల అతడిని గుర్తించడం కొంత కష్టమవుతుంది.

భూమి నుంచి చూస్తే శుక్రుడు, గురుడు పక్కపక్కనే ఉన్నట్లు కనిపించినప్పటికీ, వాస్తవానికి వాటి మధ్య దూరం కోట్ల కిలోమీటర్లుగా ఉంటుంది. అయినప్పటికీ విశ్వం మనకు చూపించే ఈ దృశ్య భ్రమ ప్రకృతి సృష్టించిన అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తుంది.

జూన్ 9న సూర్యాస్తమయం జరిగిన అరగంట తర్వాత ఈ అరుదైన ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చు. అయితే ఈ అవకాశం ఎక్కువసేపు ఉండదు. గ్రహాలు క్రమంగా హోరైజన్ వైపు సాగి అస్తమించిపోవడంతో దాదాపు గంటపాటు మాత్రమే ఈ దృశ్యాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది.

కాబట్టి ఆకాశాన్ని ప్రేమించే వారు, ఖగోళ విశేషాలపై ఆసక్తి ఉన్న వారు, ప్రకృతి అద్భుతాలను తమ కళ్లారా చూడాలనుకునే వారు జూన్ 9 సాయంత్రం ఆకాశం వైపు తప్పక ఓసారి చూడాలి. ఎందుకంటే ప్రతి రోజు కనిపించని ఈ “విశ్వ చుంబనం” మరోసారి ఎప్పుడు దర్శనమిస్తుందో చెప్పడం కష్టం. విశ్వం తన అపారమైన సౌందర్యాన్ని మన ముందుంచే ఈ అరుదైన క్షణాన్ని ఆస్వాదించడం నిజంగా ఒక అపూర్వ అనుభూతి.

“ఒక్క మొక్క.. ఎన్నో ప్రాణాలకు అండ”

0

“ఒక్క మొక్క.. ఎన్నో ప్రాణాలకు అండ”

– పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

– కేటీపీపీలో మొక్కలు నాటిన సిఈ శ్రీ ప్రకాష్

*గణపురం, జూన్ 05 (పీపుల్స్ డైరీ):*

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, భావి తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే విస్తృతంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ) చీఫ్ ఇంజినీర్ శ్రీ ప్రకాష్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండలంలోని చెల్పూర్ గ్రామంలోని కేటీపీపీ ఆవరణలో ఘనంగా మొక్కల పెంపకం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ ఇంజినీర్ శ్రీప్రకాష్ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల ప్రభావం మానవాళికి సవాలుగా మారిందని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి అవసరమైనప్పటికీ, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కేటీపీపీ పరిసర ప్రాంతాలను మరింత హరితమయం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని, మొక్కల పెంపకం కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేలా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం అనంతరం మొక్కల సంరక్షణపై ఉద్యోగులకు సూచనలు చేశారు. మొక్కలు నాటి… భూమిని కాపాడుదాం అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరిలో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించింది. ఈ కార్యక్రమంలో కేటీపీపీ అధికారులు, ఇంజనీర్లు, కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

error: Content is protected !!