దుగ్గొండిలో ఉపాధి హామీ కూలీలకు అల్పాహారం పంపిణీ*
*దుగ్గొండి:*
దుగ్గొండి గ్రామ పరిధిలో ఉపాధి హామీ పనులకు వస్తున్న కూలీలకు మంగళవారం ఉదయం అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, కూలీల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దుగ్గొండి గ్రామ సర్పంచ్ *శ్రీ కామిశెట్టి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ వాజిద్ పాల్గొని కూలీలకు స్వయంగా అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీల సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని, ఎండలు ఎక్కువగా ఉన్నందున కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ (FA), మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


















