సమసమాజ స్థాపన కోసం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీల పోరాటం: వంగూరి ఆనందరావు మాదిగ
మహనీయుల ఆశయ సాధన, సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ (MRPS), ఎంఎస్పీ (MSP)లు ముందుకు సాగుతాయని పార్టీ వరంగల్ జిల్లా ఇంచార్జి వంగూరి ఆనందరావు మాదిగ స్పష్టం చేశారు. నల్లబెల్లి మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్‌లో మండల ఇన్చార్జి ఎసంపల్లి రాజు మాదిగ అధ్యక్షతన, మాజీ అధ్యక్షుడు పరికరత్నం మాదిగ సమన్వయంలో నిర్వహించిన నూతన కమిటీల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గౌతమ బుద్ధుడు, అశోక చక్రవర్తి, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, సంత్ రవిదాస్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, కాన్షీరామ్ వంటి మహనీయులు కలలుగన్న సమసమాజ స్థాపనకు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కట్ల రాజశేఖర్ మాదిగ మాట్లాడుతూ… సెప్టెంబర్ 9న వరంగల్ జిల్లా కేంద్రంలో జరగనున్న జాతీయ స్థాయి మండల అధ్యక్షులు, అధికార ప్రతినిధుల సదస్సును జయప్రదం చేయాలని కోరారు.ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన వారిలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా గన్నారం అఖిల్ మాదిగ, ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధిగా సంకినేని రాజేష్ మాదిగ,ఎంఎస్పీ మండల అధ్యక్షుడుగా గంగారపు అనిల్ మాదిగ,ఎంఎస్పీ అధికార ప్రతినిధిగా కందిక రమేష్ మాదిగ, వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడుగా ఈదునూరి విజయకుమార్ మాదిగ ఎన్నికయ్యారు.ఈ సమావేశంలో వివిధ గ్రామాల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు సంకినేని రమేష్ (ముచింపుల), మామిడిపల్లి కార్తీక్ (శనిగరం), బైరిపాక మధు (గుండ్ల పహాడ్), దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
