ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్అనారోగ్యంతో వ్యక్తి మృతి.

అనారోగ్యంతో వ్యక్తి మృతి.

📰 Generate e-Paper Clip

అనారోగ్యంతో వ్యక్తి మృతి.

(పీపుల్స్ డైరీ) క్రైమ్

అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. అర్వపల్లి గ్రామానికి చెందిన సైద్ జానీ (45) వ్యవసాయ కూలీగా జీవనం సాగించేవాడు.
సుమారు ఏడాది క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన జానీని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు క్షయ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి పనికి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటున్న ఆయన, అనారోగ్యం మరియు కుటుంబ పరిస్థితులపై తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మద్యపానానికి కూడా అలవాటుపడ్డాడు.
ఈ నెల 27న సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన జానీ రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు అతడి కోసం వెతికారు. మరుసటి రోజు సాయంత్రం సిద్ధాపురం సర్పంచ్ హరీష్.. కోమటికుంట బండల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు మృతదేహాన్ని పరిశీలించగా అది సైద్ జానీదిగా గుర్తించారు. తీవ్ర అనారోగ్యంతోనే తన భర్త మృతిచెందాడని, ఘటనపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని మృతుడి భార్య మౌలాన్ బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు ఆధారంగా హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహానికి పంచనామా నిర్వహించి ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!