
కురిసిన వర్షం – రైతుల హర్షం
ఏన్కూరు జూలై 26 పీపుల్స్ డైరీ
ఏన్కూరు మండలంలో ఆదివారం సాయంత్రం మోస్తరుగా వర్షం కురిసింది .దీంతో రైతులు ,ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు నెల రోజుల నుంచి వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. సాగు చేసిన పంటలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు .వర్షాల కోసం అనేక గ్రామాలలో ప్రజలు గ్రామ దేవతలకు పూజలు చేశారు. వరుణ దేవుడు కరుణించాలని వేడుకున్నారు. ఎట్టకేలకు వరుణ దేవుడు కరుణించాడు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతున్నది. కురిసిన వర్షం పంటలకు ప్రధానంగా పత్తికి ఊపిరి పోసినట్లయింది.

