చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు.
పీపుల్స్ డైరీ. ఉమ్మడి వరంగల్ జిల్లా క్రైమ్ రిపోర్టర్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నిందితుడిని మిల్స్ కాలనీ సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు నిందితుడి నుంచి సుమారు 12 లక్షల విలువైన 70.19 గ్రాముల బంగారు ఆభరణాలు 527.9 గ్రాముల వెండి రూపాయలు 29. 875 నగదు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీస్ కమిషనర్ సీత ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టాయి ఈ క్రమంలో అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడయ్యాయి పెద్ద పెళ్లికి చెందిన ఆశిష్ శ్రీనివాస్ రెడ్డి మల్ల (27). ప్రస్తుతం మహారాష్ట్రలోని చంద్రపూర్ లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు సులభంగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో పగటిపూట తాళం వేసిన ఇల్లను గుర్తించి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడేవాడని వెల్లడించారు మహారాష్ట్రలో నాలుగు చోరీలకు పాల్పడి అక్కడి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లిన నిందితుడు బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా నేరాలకు పాల్పడినట్లు తెలిపారు ఈ ఏడాది మిల్స్ కాలనీ పరిధిలో శివనగర్ ఎస్ ఆర్ ఆర్ నగర్ ప్రాంతంలో తాళం వేసిన ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది నిందితుడిని వరంగల్ రైల్వేస్టేషన్లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ స్వామి ఎస్సై మహేష్ మరియు మిల్స్ కాలనీ సిబ్బందిని పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు
