నిమ్స్ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా డాక్టర్ మార్తా రమేష్ ఏకగ్రీవ ఎన్నిక
గీసుకొండ పీపుల్స్ డైరీ ఆగస్టు 16
సేవకు దక్కిన గౌరవం, నమ్మకానికి లభించిన గుర్తింపుగా నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ మార్తా రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటూ, అవసరమైన వేళ అండగా నిలిచే ఆయనకు ఈ బాధ్యతలు దక్కడం పట్ల ఉద్యోగులు, వైద్య వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సేవ చేస్తే గుర్తింపు వస్తుందని, నమ్మకం ఉంటే నాయకత్వం వరిస్తుందని ఈ ఎన్నిక మరోసారి నిరూపించింది.
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎల్కుర్తి గ్రామంలో పుట్టి నిమ్స్ లో సాధారణ డాక్టర్ గా తన వైద్య ప్రస్థానాన్ని ప్రారంభించారు రోగులకు మెరుగైన వైద్యం అందిస్తూ వైద్య వర్గాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు డాక్టర్ మార్తా రమేష్ నిమ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో సాధారణ డాక్టర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, అనుసంధానకర్తగా, ఆపై ఆర్‌ఎమ్‌ఓ గా అంచెలంచెలుగా ఎదుగుతూ తన సమర్థతను నిరూపించుకున్నారు. నిబద్ధత, నిరంతర సేవానిరతితో అందరి అభిమానాన్ని చూరగొన్న ఆయనకు ఈ పదవి దక్కడం ఆయన సేవాభావానికి దక్కిన తగిన గౌరవంగా సభ్యులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు డాక్టర్ మార్తా రమేష్‌కు పలువురు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈ కొత్త బాధ్యతను విజయవంతంగా నిర్వర్తిస్తూ ఉద్యోగుల సంక్షేమానికి మరింత కృషి చేయాలని, భవిష్యత్తులో వృత్తిపరంగా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ఆయన నేతృత్వంలో సొసైటీ మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.
