విద్యుత్ షాక్‌తో ఆశా వర్కర్ విషాదాంతం
నల్లబెల్లి:పీపుల్స్ డైరీ
విద్యుత్ షాక్ తగిలి బర్తిపాక లక్ష్మి (37) అనే ఆశా వర్కర్ మృతి చెందినట్లు నల్లబెల్లి సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సాయి ప్రసన్న కుమార్ తెలిపారు.నల్లబెల్లి గ్రామానికి చెందిన గద్దె మహేందర్ చెల్లెలు బర్తిపాక లక్ష్మి ఆశా వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల తన అన్న ఇంట్లోనే నివసిస్తోంది. మంగళవారం ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో స్నానం చేసిన అనంతరం బాత్రూమ్ వద్ద బట్టలు ఆరేసే క్రమంలో, అక్కడ ఉన్న విద్యుత్ తీగను ప్రమాదవశాత్తు తాకడంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అక్కడే పడిపోయింది.గమనించిన కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో ఆమెను వెంటనే నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.మృతురాలి అన్న మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి చేసి, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
