ePaper
Friday, September 25, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్ఇసుక లారీల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం: బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్

ఇసుక లారీల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం: బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్

📰 Generate e-Paper Clip

ఇసుక లారీల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం: బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్

పర్యాటకంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ములుగు జిల్లాలో నిత్యం ఇసుక లారీల వల్ల ప్రమాదాలు జరిగి స్థానిక ప్రజలు, పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇసుక లారీలను నియంత్రించాలని డిమాండ్ చేసిన ప్రస్తుత రాష్ట్ర మంత్రి సీతక్క, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రభుత్వం ఇసుక మాఫియాతో చేతులు కలిపి అక్రమ ఆర్జనే ధ్యేయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.నిత్యం జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికి ఇసుక లారీల రాకపోకలపై కఠిన నియంత్రణ విధించాలి.లారీల రాకపోకలను కేవలం రాత్రి వేళల్లో మాత్రమే అనుమతించాలి.సెలవు దినాల్లో పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇసుక లారీల రవాణాను పూర్తిగా నిలిపివేయాలి.

మంత్రి సీతక్క గతంలో చేసిన డిమాండ్లను వెంటనే అమలు చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని నగరపు రమేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!