పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వ పట్టివేత
– 5 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
– ఒకరు అదుపులో.. పోలీసులకు అప్పగింత
– రవినగర్ లో సీసీఎస్ బృందం తనిఖీలు
పీపుల్స్ డైరీ, గణపురం:
గణపురం మండలంలోని రవినగర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 5 క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యాన్ని సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో రవినగర్ గ్రామానికి చెందిన తుర్పాటి రాజశేఖర్ (30)ను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ బృందం రవినగర్‌లో తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా రాజశేఖర్ అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు గుర్తించింది. అతని వద్ద ఉన్న సుమారు 5 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని, బియ్యాన్ని తదుపరి చట్టపరమైన చర్యల కోసం గణపురం పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, తరలించడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
