ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్మెగా టెక్స్‌టైల్ పార్కులో విషాదం..

మెగా టెక్స్‌టైల్ పార్కులో విషాదం..

📰 Generate e-Paper Clip

గీసుగొండ మండలం శాయంపేట శివారులోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో ఇవాళ (గురువారం) విషాద ఘటన చోటుచేసుకుంది. గణేశా ఎకోపెట్ క్లాత్ ఫ్యాక్టరీలో లిఫ్ట్‌లో ఇరుక్కుని ఇద్దరు సిబ్బంది మృతిచెందారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాంకేతిక నిపుణులు అభిలాష్ (30), సూర్యప్రకాశ్ (31)గా మృతులను గుర్తించారు. అయితే, వారిద్దరూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు.

ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల పూర్తి కారణాలపై ఆరా తీస్తున్నారు. లిఫ్ట్‌లో ప్రమాదం ఎలా జరిగింది? నిజంగానే షార్ట్‌సర్క్యూట్ జరిగిందా? వంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!