ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeతెలంగాణగ్రామ స్థాయి ప్రధమ ప్రజా ప్రతినిధి సెటిల్‌మెంట్ దందా?

గ్రామ స్థాయి ప్రధమ ప్రజా ప్రతినిధి సెటిల్‌మెంట్ దందా?

📰 Generate e-Paper Clip

🔥గ్రామ స్థాయి ప్రధమ ప్రజా ప్రతినిధి సెటిల్‌మెంట్ దందా?

🔥ఏడాది తిరగక ముందే వివాదంలో ఉన్న భూములపై సెటిల్మెంట్ ల అవతారం?

పీపుల్స్ డైరీ బ్యూరో:
పదవి చేపట్టి ఏడాది కూడా నిండకుండానే ఒక గ్రామ స్థాయి మొదటి ప్రజా ప్రతినిధి అక్రమాల బాట పట్టినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ప్రజలకు సేవ చేయాల్సిన స్థానంలో ఉండి, భూ సెటిల్‌మెంట్లు మరియు అక్రమ వసూళ్లకు తెరలేపిన వైనం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతి భూ తగాదాల లో తలదూర్చి తానే సెటిల్మెంట్ చేస్తానని ఆ గ్రామానికి తానే రాజు తానే మంత్రి తానే సర్పంచ్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. కోర్టు తగాదాలు సైతం జడ్జి లెవెల్లో జడ్జిమెంట్లు సైతం ఇచ్చేస్తున్నాడని వినికిడి? విశ్వసనీయ సమాచారం ప్రకారం
ఆ గ్రామపంచాయతీ పరిధిలో ఒక వ్యక్తికి 20 గుంటల భూమి ఉండగా మా భూమి తన అవసర నిమిత్తం ఒక ఇంటి నెంబర్ కి పర్మిషన్ కి అప్లికేషన్ పెట్టుకోగా తనకు ఆ పరిమిషన్ ఇవ్వడానికి రెండు గుంటల భూమిని కొన్నట్టుగా బినామీ పేర్లతో రాయించుకున్నారని గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఇంటి నెంబర్ కి గాను సంబంధిత ఆ గ్రామపంచాయతీ కార్యదర్శి కి పెద్ద మొత్తంలో కొంత ముడుపును కూడా ఇస్తానని చెప్పి అతనికి ఆ డబ్బులు కూడా ఎగ్గొట్టాడని, ఆ కార్యదర్శి కూడా ఇలాంటి విషయాలు బయటికి పొక్కితే తన మీద కూడా అబండాలు మీద పడతాయని గుట్టుచప్పుడు కాకుండా మౌనం వహిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న కార్యదర్శిని కూడా తన గుప్పిట్లో పెట్టుకొని తనకు నచ్చిన విధంగా మలుచుకొని తన పనులు ఈజీగా చక్కబెట్టుకుంటున్నాడనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఒక ఇంటి నెంబర్ విషయంలో ఇద్దరి వ్యక్తుల దగ్గర డబ్బులు డిమాండ్ చేసిన విషయం స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా ఆ పంచాయతీ వెళ్లినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఎక్కడ భూమి కొలతలు నిర్వహించిన అట్టి భూ కొలతల విషయంలో 500 రూపాయలు కూడా తన ఖాతాలోకి రావాలని ఉక్కుమ్ జారీ చేసినట్లు సర్వత్ర ఆ గ్రామంలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ఇంటి నెంబర్ల కోసం ఇంటి పర్మిషన్ కోసం వెళ్లిన ఏదో ఒక మెలిక పెట్టి గ్రామపంచాయతీ చుట్టూ తిప్పుతున్నారని తనకు ప్రసన్నo అయిన వ్యక్తులకే అన్ని పనులు జరుగుతున్నాయి అని గ్రామంలో చర్చలు గట్టిగా నడుస్తున్నాయి అని వినికిడి. అసలు ఎక్కడ ఆ గ్రామపంచాయతీ?
ఎవరా ప్రతినిధి? ఎంటా ఆ కథా? పూర్తి కథనం
మీ పీపుల్స్ డైరీ దినపత్రిక లో?
త్వరలో….

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!