ePaper
Thursday, September 24, 2026
ePaper
Homeతెలంగాణపెద్దమ్మ తల్లి ఆలయానికి భూమిపూజ

పెద్దమ్మ తల్లి ఆలయానికి భూమిపూజ

📰 Generate e-Paper Clip

– భూమిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

పీపుల్స్ డైరీ, గణపురం:

గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సోమవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఆలయ నిర్మాణ స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి భూమిపూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. ఆలయ నిర్మాణానికి గ్రామస్థులు, భక్తులు సమష్టిగా సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పూజారి రాజేందర్ ఆలయ కమిటీ అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లపళ్లి భాస్కర్ రావు, ఆలయ నిర్వాహకులు, ముదిరాజ్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!