ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్బెదిరింపులకు భయపడం.. దాడులతో బీజేపీని ఆపలేరు: తడుక వినయ్ గౌడ్ హెచ్చరిక

బెదిరింపులకు భయపడం.. దాడులతో బీజేపీని ఆపలేరు: తడుక వినయ్ గౌడ్ హెచ్చరిక

📰 Generate e-Paper Clip

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి.. కాంగ్రెస్ గూండాయిజానికి నిదర్శనం: తడుక వినయ్ గౌడ్

నల్లబెల్లి: నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడిని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి కాంగ్రెస్ పార్టీ అసలు రాజకీయ సంస్కృతిని, వారి అసహన వైఖరిని బయటపెట్టిందని మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకు రాజకీయంగా బీజేపీని ఎదుర్కొనే దమ్ము లేకనే దాడులు, విధ్వంసాలకు దిగుతున్నారని విమర్శించారు. ప్రజల మద్దతుతో బీజేపీ బలపడుతుండటాన్ని జీర్ణించుకోలేకనే ప్రజాస్వామ్యంపై ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు.

తమ సంయమనాన్ని చేతగానితనంగా భావిస్తే అది కాంగ్రెస్ అజ్ఞానమే అవుతుందని హెచ్చరిస్తూ, బీజేపీకి రాజ్యాంగం, చట్టం, ప్రజాస్వామ్యంపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. అధికార అహంకారంతో దాడులు చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారన్నారు. దాడులు, బెదిరింపులు, కేసులతో బీజేపీ పోరాటాన్ని ఆపలేరని, తెలంగాణలో పార్టీ మరింత బలంగా ఎదుగుతుందని స్పష్టం చేశారు.

కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. దాడులు చేసి అడ్డుకోవాలని చూస్తే అది భ్రమ మాత్రమేనని, కాంగ్రెస్ గూండాయిజానికి చట్టబద్ధమైన, ప్రజాస్వామ్యబద్ధమైన మార్గంలోనే గట్టి సమాధానం ఇస్తామని వినయ్ గౌడ్ పేర్కొన్నా

రు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!