ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeవరంగల్నల్లబెల్లిలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం.

నల్లబెల్లిలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం.

📰 Generate e-Paper Clip

నల్లబెల్లిలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం.

పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం – డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి.

నల్లబెల్లి మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్‌లో శంకర కంటి ఆసుపత్రి, జనతా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 2వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి సుమారు 600 మంది ప్రజలు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు.నిపుణులైన వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స, వైద్య సలహాలు అందించారు. కంటి శస్త్రచికిత్స అవసరమైన వారిని గుర్తించి, తదుపరి చికిత్స కోసం ఎంపిక చేశారు. వైద్యుల సూచనల మేరకు అవసరమైన వారికి ఉచిత కళ్లద్దాలు, కంటి ఆపరేషన్లు అందించేలా చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా జనతా ట్రస్ట్ చైర్మన్ డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. “ఆర్థిక స్థోమత లేక వైద్యం పొందలేని పేద ప్రజలకు అండగా నిలవడమే జనతా ట్రస్ట్ ప్రధాన లక్ష్యం. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ అవసరమైన వైద్య సహాయం అందించే వరకు మా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి” అని అన్నారు.

“ఆరోగ్యమే మహాభాగ్యం. డబ్బు లేక ఏ పేదవాడు కూడా వైద్యానికి దూరం కాకూడదు. ప్రజలకు అండగా నిలవడమే జనతా ట్రస్ట్ లక్ష్యం” అని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, విద్యా సహాయ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని, ప్రజాసేవలో ఎప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు.ఈ శిబిరాన్ని విజయవంతం చేసిన శంకర కంటి ఆసుపత్రి వైద్య బృందానికి, జనతా ట్రస్ట్ సభ్యులకు, అలాగే పెద్ద ఎత్తున హాజరై సహకరించిన నల్లబెల్లి మండల ప్రజలకు డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జనతా ట్రస్ట్ సభ్యులు పాల్గొని, శిబిరం విజయవంతంగా నిర్వహించడంలో తమ వంతు సహకారం అందించారు.

ప్రజల ఆశీర్వాదంతో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల ఆరోగ్యమే ప్రథమ లక్ష్యంగా.. సేవే సంకల్పంగా.. జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని ఉచిత వైద్య సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తంచేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!