ప్రజా భవన్‌లో ఆత్మీయ రాఖీ వేడుక: మంత్రి సీతక్కకు ‘జీవిత చరిత్ర’ పుస్తకాన్ని కానుకగా ఇచ్చిన రచయిత కడియాల సురేష్ కుమార్
హైదరాబాద్:
రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో సోదరభావానికి వేదికగా నిలిచే ఒక అపురూప ఘట్టం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి సీతక్క యువ రచయిత కడియాల సురేష్ కుమార్ కు ప్రేమానురాగాలతో రాఖీ కట్టారు.
ఈ సందర్భంగా సురేష్ కుమార్ తాను స్వయంగా రచించిన మంత్రి సీతక్క గారి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆమెకు రాఖీ కానుకగా బహుకరించారు. అడవి బిడ్డగా ప్రయాణం ప్రారంభించి, ప్రజల మనిషిగా, ప్రజా నాయకురాలిగా ఎదిగిన అక్క పోరాట పటిమను, జీవిత ప్రస్థానాన్ని పుస్తక రూపంలోకి తీసుకురావడం మరియు దాన్నే రాఖీ పండుగ రోజున ఆమెకు కానుకగా అందించడం తన జీవితంలో మరువలేని అనందకరమైన క్షణమని ఆయన పేర్కొన్నారు.తమ్ముడు అందించిన ఈ అరుదైన కానుకను స్వీకరించిన మంత్రి సీతక్క గారు, సురేష్ కుమార్ కు ఆత్మీయంగా రాఖీ కట్టి, దీవెనలు అందజేశారు.

