ePaper
Saturday, July 11, 2026
ePaper
Homeఎడిటోరియల్నిండు ప్రాణానికి రెండు చుక్కలు..

నిండు ప్రాణానికి రెండు చుక్కలు..

📰 Generate e-Paper Clip

నిండు ప్రాణానికి రెండు చుక్కలు…

– ప్రతి చిన్నారి ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
– ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలి
– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
– ఇంటింటికీ చేరి లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులకు సూచన
– ఒక్క చిన్నారి కూడా మిస్ కాకూడదన్న కలెక్టర్
– చెల్పూర్ లో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం

పీపుల్స్ డైరీ, గణపురం: దేశాన్ని పోలియో రహితంగా కొనసాగించేందుకు ప్రతి తల్లిదండ్రులు ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. ఆదివారం గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం పోలియో బూత్‌ను సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్‌తో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా చిన్నారులను పోలియో వ్యాధి బారిన పడకుండా సమర్థంగా రక్షించవచ్చని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం బాధ్యతగా తీసుకుని ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఒక్క చిన్నారి కూడా మిగలకుండా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ… పల్స్ పోలియో కార్యక్రమం దేశ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన ప్రజారోగ్య కార్యక్రమమని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించి, దేశాన్ని పోలియో రహితంగా కొనసాగించవచ్చని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, ప్రతి ఇంటికీ చేరుకుని లక్ష్యాన్ని పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శ్రమిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బందిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, సర్పంచ్ కావటి రజిత రవీందర్, పిఎసిఎస్ చైర్మన్ గండ్ర సత్యనారాయణ రెడ్డి, చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని డాక్టర్ స్వాతి, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!