ePaper
Thursday, September 24, 2026
ePaper
Homeఆరోగ్యంమరణానంతర నేత్రదానం: ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన పిట్టల సిరివెన్నెల సేవ స్ఫూర్తి

మరణానంతర నేత్రదానం: ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన పిట్టల సిరివెన్నెల సేవ స్ఫూర్తి

📰 Generate e-Paper Clip

 

• కన్నుమూసినా క్రాంతిగా మారి.. ఇద్దరి జీవితాల్లో నూతన కాంతులు నింపిన సిరివెన్నెల

• మరణాన్ని జయించిన మానవత్వం: నేత్రదానంతో ఆదర్శంగా నిలిచిన పిట్టల సిరివెన్నెల కుటుంబం

• నేత్రదానంతో ఇద్దరికి పునర్జన్మ: నల్లబెల్లిలో సిరివెన్నెల కుటుంబానికి ఘన సన్మానం

నల్లబెల్లి (సెప్టెంబర్ 8):పీపుల్స్ డైరీ

ఆమె ఈ లోకాన్ని వీడినా.. తన కన్నులతో మరో ఇద్దరి జీవితాల్లో నూతన కాంతులు నింపింది. మరణానంతరం నేత్రదానం చేసి సమాజానికి గొప్ప ఆదర్శంగా నిలిచారు పిట్టల సిరివెన్నెల. ఈ మహత్తర కార్యానికి గుర్తింపుగా హైదరాబాద్‌లోని ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ (రామాయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్) ద్వారా “కృతజ్ఞతా ప్రశంసా పత్రం” (A Grateful Acknowledgement) అందజేయబడింది.సిరివెన్నెల సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ నల్లబెల్లిలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సంస్మరణ సభ నిర్వహించారు. పుట్టెడు దుఃఖంలోనూ తోటివారికి చూపునివ్వాలనే ఉదారత చూపిన సిరివెన్నెల కుటుంబ సభ్యులు పిట్టల రజిత, రమేష్‌లను ఈ సందర్భంగా సభలో ఘనంగా సన్మానించి వారి మానవతా దృక్పథాన్ని అభినందించారు.

“నేత్రదానం కన్నా మిన్నయైన మానవతా సేవ లేదు”

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్లబెల్లి ఎస్ఐ ఎం. సాయి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. మరణానంతరం నేత్రదానం ద్వారా ఇతరులకు చూపునివ్వడం అత్యున్నతమైన మానవతా సేవ అని కొనియాడారు. సిరివెన్నెల కుటుంబం చూపిన ధైర్యం, సామాజిక స్పృహ ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొంటూ, సమాజంలో నేత్రదానంపై మరింత అవగాహన పెరగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ చల్ల గురువుల చలపతి (దళపతి), హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కె. శంకరరావు, వరంగల్ జిల్లా కార్యదర్శి గోవింద్ కుమారస్వామి, డాక్టర్ గాల శ్రీనివాస్, ఆకుల సుభాష్‌లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానికులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!