ePaper
Friday, September 25, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్కొండాయిలపల్లిలో శోకసంద్రం: పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యం విని కుంగుబాటు.. గుండెపోటుతో ఊరటి నరేష్ ఆకస్మిక...

కొండాయిలపల్లిలో శోకసంద్రం: పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యం విని కుంగుబాటు.. గుండెపోటుతో ఊరటి నరేష్ ఆకస్మిక మరణం

📰 Generate e-Paper Clip

BRS సీనియర్ నాయకుడు, కొండాయిలపల్లి వార్డు మెంబర్ ఊరటి నరేష్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికరం: సంతాపం తెలిపిన నాయకులు

నల్లబెల్లి: నల్లబెల్లి మండలం కొండాయిలపల్లి గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్, BRS పార్టీ సీనియర్ నాయకుడు ఊరటి నరేష్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

నిన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు వచ్చిందన్న వార్త తెలుసుకున్న నరేష్ హుటాహుటిన రోహిణి హాస్పిటల్‌కు చేరుకున్నాడు. అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితిని చూసి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించేంత వరకు దగ్గరుండి చూసుకున్నాడు. అనంతరం ఇంటికి చేరుకున్న నరేష్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తన అభిమాన ఉద్యమ నాయకుడిని ఆ పరిస్థితిలో చూడటం బాధగా ఉందని స్థానిక నాయకులతో పంచుకున్నాడు.

దురదృష్టవశాత్తు నేటి ఉదయం ఊరటి నరేష్ కూడా తీవ్ర గుండెపోటుకు గురై ఆకస్మికంగా కన్నుమూశాడు. నాయకుడిపై ఉన్న ప్రేమాభిమానాలు, మనోవేదనే ప్రాణాలను బలిగొనడం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

నరేష్ అకాల మరణం పట్ల BRS పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. నరేష్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!