ePaper
Saturday, July 11, 2026
ePaper
Home Blog Page 2

పవిత్ర ఆలయంలో పొలిటికల్ స్టంట్లు.

0

పవిత్ర ఆలయంలో పొలిటికల్ స్టంట్లు

కూడా ప్లాటింగ్ లో అవకతవకలంటూ ఒకరు

ఎటువంటి దోపిడీ అక్రమాలు జరగలేదంటూ మరొకరు

ఆలయం అపవిత్రమైందని పవిత్రం చేయటానికి మరొకరు

పవిత్రాపవిత్రాలు రాజకీయ ఆలయాల చుట్టూ చేయాలి

ఆటంకాలు కలిగిస్తూ పార్టీలను అభాసు పాలు చేస్తున్నారంటూ భక్తులు

ఆలయ పరిసరాల్లో క్షుద్ర పూజలు, ఆలయంలో కరెంట్ కట్…కారణం..?

సంఘటనలు జరుగుతుంటే చోద్యం చూస్తున్న ఆలయ అధికారులు

పీపుల్స్ డైరీ ప్రతినిధి వరంగల్

  • ఓరుగల్లు చరిత్రగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో పలు రాజకీయ పార్టీ వర్గాలు స్టంట్లు చేశాయి గత ప్రభుత్వంలో కూడా ప్లాట్ల విషయంలో అవకతవకలు జరిగాయంటూ నింద వేస్తే తప్పు చేయలేదంటూ నిరూపించుకుంటానని ఉదయాన్నే తడిచిన బట్టలతో ఆలయంలో ప్రమాణం చేస్తూ ఒకరు పొరపాట్లు దొర్లాయంటూ మరొకరు భద్రకాళి ఆలయం ఇలా అపవిత్రం చేస్తారా అంటూ పవిత్రం చేయటానికి మరొకరు ఈ అనాలోచిత సంఘటన అటు పార్టీ వర్గాల్లో ఇటు భక్తుల నడుమ హాట్ టాపిక్ గా మారింది ఏదైనా తేల్చుకుంటే బాహాటంగా తేల్చుకోవాలి కానీ ఇలా భద్రకాళి ఆలయానికి దర్శనానికి వచ్చే భక్తులకు ఆటంకాలు కలిగిస్తూ పార్టీ పరువు బజారు పాలు చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు ఇక ముందు రోజు రాత్రి భద్రకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో క్షుద్ర పూజలంటూ ప్రచారం రాత్రి సమయంలో దాదాపు గంటల కొద్ది విద్యుత్ లేకపోవటం ఇదంతా చూస్తుంటే భక్తుల్లో ఏదో తెలియని ఆందోళన వ్యక్తం ఏర్పడింది ఇలాంటి దుశ్చర్యల వలనే ఎన్నడూ లేని విధంగా జరిగిన సంఘటనల పై పలు అనుమానాలు సైతం వ్యక్తం చేయాల్సి వస్తుంది ఇదిలా ఉండగా ఇంత రాద్దాంతం జరుగుతుంటే చేతులు కట్టుకుని చోద్యం చూస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు

రేగొండలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య

0

 

భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు హత్యకు గురయ్యాడు. రంగయ్యపల్లి గ్రామానికి చెందిన జట్టి శ్రావణ్ (35) మండల కేంద్రంలోని వైన్ షాప్ సమీపంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.ప్రతిరోజులాగే శుక్రవారం రాత్రి దుకాణం మూసివేసి ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శ్రావణ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. మృతదేహం సమీపంలో ఒక తల్వార్ కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది.ఈ ఘటనకు గల అసలు కారణాలు ఇంకా వెల్లడికాలేదు. హత్యలో ఎంతమంది పాల్గొన్నారు, దాడికి దారితీసిన పరిస్థితులు ఏమిటనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.మృతుడికి భార్య మౌనికతో పాటు ఒక కుమారుడు, ఒక కుమార్తెను వదిలి వెళ్లాడు. ఈ ఘటనతో రేగొండ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది.

బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుడుతాల నగేష్**

0

**బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుడుతాల నగేష్**

(దుగ్గొండి) పీపుల్స్ డైరీ

నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుడుతాల నగేష్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా party (బీజేపీ) లో చేరారు.బీజేపీ సీనియర్ నాయకులు బూర్ల రవి ఆధ్వర్యంలో, మండల అధ్యక్షులు నెదురు రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఒక కార్యక్రమంలో.. భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్ష్యంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలపై ప్రజలు, నాయకులు విసుగు చెందారని విమర్శించారు. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ పథకాలకు, అభివృద్ధికి ఆకర్షితులై రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే సరైన ప్రత్యామ్నాయమని గ్రహించి కుడుతాల నగేష్ బీజేపీలో చేరినట్లు స్పష్టం చేశారు. ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి మోసం చేస్తున్న పార్టీలకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.ఈ చేరికల కార్యక్రమంలో మహ్మదాపురం సొసైటీ వైస్ చైర్మన్ పాలడుగుల జీవన్, గోగుల రాజీ రెడ్డి మరియు స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

 

అంగన్వాడి కేంద్రంలో పౌష్టిక ఆహారం పంపిణీ.. ప్రారంభించిన సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ*

0

 

*అంగన్వాడి కేంద్రంలో పౌష్టిక ఆహారం పంపిణీ.. ప్రారంభించిన సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ*
*కోదాడ, పీపుల్స్ డైరీ:* మండలంలోని తాడ్వాయి గ్రామ అంగన్వాడి కేంద్రంలో గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారులకు ప్రభుత్వం తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న ఏడు నెలలు నుండి మూడు సంవత్సరాలు వరకు పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడ్వాయి గ్రామ సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ, బుచ్చిపాపయ్య ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు బాలామృతం, పాలు, గుడ్లు తదితర పౌష్టిక ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ, బుచ్చిపాపయ్య మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న సంపూర్ణ పౌష్టిక ఆహారాన్ని ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. తద్వారా మహిళల్లో, చిన్నారుల్లో రక్తహీనత, పోషకాహార లోపాలు వంటి సమస్యలను అధిగమించవచ్చని, తల్లీ బిడ్డలు క్షేమంగా ఉంటారని పేర్కొన్నారు.చిన్నారులకు చిన్నతనం నుంచే పౌష్టికాహారం అందించడం వల్ల వారి శారీరక, మానసిక ఎదుగుదల బాగుంటుందని తెలిపారు. ఈ సేవలను గ్రామ లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కేంద్రం టీచర్లు, ఆయా, ఆశా వర్కర్లు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

*అంగన్వాడి కేంద్రంలో పౌష్టిక ఆహారం పంపిణీ.. ప్రారంభించిన సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ*
*కోదాడ, పీపుల్స్ డైరీ:* మండలంలోని తాడ్వాయి గ్రామ అంగన్వాడి కేంద్రంలో గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారులకు ప్రభుత్వం తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న ఏడు నెలలు నుండి మూడు సంవత్సరాలు వరకు పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడ్వాయి గ్రామ సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ, బుచ్చిపాపయ్య ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు బాలామృతం, పాలు, గుడ్లు తదితర పౌష్టిక ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ, బుచ్చిపాపయ్య మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న సంపూర్ణ పౌష్టిక ఆహారాన్ని ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. తద్వారా మహిళల్లో, చిన్నారుల్లో రక్తహీనత, పోషకాహార లోపాలు వంటి సమస్యలను అధిగమించవచ్చని, తల్లీ బిడ్డలు క్షేమంగా ఉంటారని పేర్కొన్నారు.చిన్నారులకు చిన్నతనం నుంచే పౌష్టికాహారం అందించడం వల్ల వారి శారీరక, మానసిక ఎదుగుదల బాగుంటుందని తెలిపారు. ఈ సేవలను గ్రామ లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కేంద్రం టీచర్లు, ఆయా, ఆశా వర్కర్లు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ల పనితీరులో పారదర్శకత ఉండాలి: భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

0

భూపాలపల్లి,పీపుల్ డైరీ (జూలై,1): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీచేశారు.ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా వేగవంతం చేయాలని, ఫిర్యాదుల పరిష్కారంలో బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

వరంగల్ సిపి గా ఎన్. శ్వేత నియామకం.

0

#వరంగల్ సీపీగా ఎన్. శ్వేత నియామకం

వరంగల్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న సన్‌ప్రీత్ సింగ్‌ను రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో 2012 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఎన్. శ్వేతను వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.ప్రస్తుతం హైదరాబాద్ నార్త్ జోన్ జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్. శ్వేత, గతంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ, సిద్దిపేట పోలీస్ కమిషనర్, హైదరాబాద్ డీసీపీ, డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. పదేళ్ల సేవా కాలంలో మొత్తం తొమ్మిది ముఖ్యమైన పోస్టింగుల్లో పనిచేసిన అనుభవం ఆమె సొంతం.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్. శ్వేత ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, 2012లో యూపీఎస్సీ ద్వారా ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అనుభవజ్ఞురాలైన అధికారిణిగా గుర్తింపు పొందిన ఆమె నియామకంతో వరంగల్ పోలీసింగ్‌లో మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడం లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం.

0

భూ భారతి లో పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలి

సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటం లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం

తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు

ఏన్కూరు:- భూ భారతి లో భాగంగా సమగ్ర భూ సర్వే జరిపి కాస్తు ఆధారంగా పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఏన్కూరు మండలం తిమ్మారావు పేట లో సెంటర్ లో సిపియం పతాకాన్ని కాట్రాల బిక్షం ఎగురవేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి దొంతి బోయిన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో బొంతు రాంబాబు మాట్లాడుతూ ధరణ స్థానం లో భూ భారతి చట్టం వచ్చిన భూ సమస్యలు కు పరిష్కారం దొరకడం లేదని అన్నారు. సమగ్ర భూ సర్వే జరిపి భూమి సాగు ఆధారంగా పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాల సాగు భూమి కి నీరు అందించే సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు సవరించిన అంచనాలు తయారు చేసిన రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం బడ్జెట్ లో మాత్రం 336 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసింది అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు అవసరమైన నిధులు విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. మహాత్మ గాంధీ ఉపాధి హామీ దేశం లో ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం కు వంద రోజులు పని గ్యారంటీ ఇచ్చిన చట్టం మార్పులు చేసి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఇష్టం అయిన ప్రాంతాల్లో మాత్రమే ఉపాధి హామీ పథకం అమలు చేయుటకు జూలై 1 నుంచి అమలు చేస్తున్నారు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో రైతులు పండించిన పంట కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం రేషన్ విధించడం ద్వారా రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా లభించ కుండా చేస్తుంది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే మేరకు రాష్ట్రం లో కొనుగోలు చేస్తుంది అని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం చేయడం సరికాదని అన్నారు. ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల వ్యవసాయం మీద ప్రభావం చూపుతుంది అని అన్నారు. గ్రామీణ ప్రజలు వ్యవసాయ రంగం రక్షణ కోసం ఉద్యమించాల్సిన సమయం వచ్చింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి, కృష్ణ, తాళ్ళపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు బాణోత్ బాలాజీ, సిపిఎం మండల కార్యదర్శులు కుందనపల్లి నరేంద్ర, అంబటి శ్రీనివాస్ రెడ్డి, బాణాల శ్రీనివాసరావు, గ్రామ కార్యదర్శి కలసాని సాయి, సిఐటియు జిల్లా నాయకులు వెల్పుల రాములు, రైతు సంఘం నాయకులు గుండా సత్యనారాయణ రెడ్డి, ఎస్ కె జానీ ,రేగల తిరుమల రావు,మన్నేపల్లి పద్మా, లక్ష్మి, వెంకట్రావమ్మ, మాజీ సర్పంచ్లు కొడేం బిక్షం,బండ్ల చిన్న జోగయ్య, తదితరులు పాల్గొన్నారు.

నిండు జీవితానికి రెండు చుక్కలు…

0

నల్లబెల్లి బస్టాండ్ ఆవరణలో ఘనంగా పోలియో చుక్కల పంపిణీ

​నల్లబెల్లి, జూన్ 28 (పీపుల్స్ డైరీ):

నల్లబెల్లి మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో పోలియో నిర్మూలనలో భాగంగా ఆదివారం పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించారు. స్థానిక వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కేంద్రానికి ప్రయాణికులు, స్థానికుల నుండి విశేష స్పందన లభించింది.
​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆచార్య చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజం నుండి పోలియో మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి చిన్నారికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, గతంలో వేయించినప్పటికీ ఈ విడతలో మళ్లీ వేయించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును అంగవైకల్యం బారిన పడకుండా కాపాడుకోవడం తల్లిదండ్రుల బాధ్యత అన్నారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి సైతం అనుకూలంగా ఉండేందుకే బస్టాండ్ ఆవరణలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.​ఈ మహత్తర కార్యక్రమంలో నల్లబెల్లి మండల ఆశా (ASHA) వర్కర్లు, వైద్య సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. బస్టాండ్‌కు వచ్చే ప్రతి బస్సునూ నిశితంగా పరిశీలిస్తూ, చుక్కలు వేయించుకోని చిన్న పిల్లలను గుర్తించి అక్కడికక్కడే మందు వేశారు. ప్రయాణికులకు పోలియో చుక్కల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరాయంగా సాగిన ఈ కేంద్రంలో వందలాది మంది పిల్లలకు చుక్కల మందు అందించారు. నేడు చుక్కలు వేయించుకోని వారి కోసం రేపటి నుండి ఆశా వర్కర్లు మండల వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించి, మిగిలిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని వైద్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

oplus_133120

oplus_133120
oplus_133120

నిండు ప్రాణానికి రెండు చుక్కలు..

0

నిండు ప్రాణానికి రెండు చుక్కలు…

– ప్రతి చిన్నారి ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
– ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలి
– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
– ఇంటింటికీ చేరి లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులకు సూచన
– ఒక్క చిన్నారి కూడా మిస్ కాకూడదన్న కలెక్టర్
– చెల్పూర్ లో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం

పీపుల్స్ డైరీ, గణపురం: దేశాన్ని పోలియో రహితంగా కొనసాగించేందుకు ప్రతి తల్లిదండ్రులు ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. ఆదివారం గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం పోలియో బూత్‌ను సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్‌తో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా చిన్నారులను పోలియో వ్యాధి బారిన పడకుండా సమర్థంగా రక్షించవచ్చని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం బాధ్యతగా తీసుకుని ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఒక్క చిన్నారి కూడా మిగలకుండా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ… పల్స్ పోలియో కార్యక్రమం దేశ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన ప్రజారోగ్య కార్యక్రమమని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించి, దేశాన్ని పోలియో రహితంగా కొనసాగించవచ్చని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, ప్రతి ఇంటికీ చేరుకుని లక్ష్యాన్ని పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శ్రమిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బందిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, సర్పంచ్ కావటి రజిత రవీందర్, పిఎసిఎస్ చైర్మన్ గండ్ర సత్యనారాయణ రెడ్డి, చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని డాక్టర్ స్వాతి, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి : డా.ప్రసన్న హరికృష్ణ

0

పీపుల్స్ డైరీ,హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ కంటెస్టెడ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్తి డా.ప్రసన్న హరికృష్ణ సోమవారం రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ నియామకాల కోసం సుమారు 19 వేల పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని, అభ్యర్థుల కోసం వయోపరిమితిని పెంచాలని, జీవో నెం.46ను రద్దు చేయాలని, అలాగే నిరుద్యోగులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన డీజీపీని కోరారు. గతంలో విడుదలైన పోలీస్ నియామక నోటిఫికేషన్లలో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి కారణంగా అవకాశాలు కోల్పోయారని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.46 కారణంగా కూడా అనేక మంది అభ్యర్థులు నష్టపోయారని వివరించారు.
అదేవిధంగా, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ఆందోళనల సందర్భంగా పలువురు యువతపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.డీజీపీ సానుకూలంగా స్వీకరించి స్పందించినట్లు ప్రసన్న హరికృష్ణ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విష్ణు వర్ధన్, మెండెం కిరణ్ కుమార్‌తో పాటు నిరుద్యోగ నాయకులు వంశీ, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!